టాలీవుడ్ లో నెంబర్ వన్ ప్లేస్ కి పోటీ పడుతున్న ఇద్దరు హీరోలు పవన్
కళ్యాణ్, మహేష్ బాబు ఈ వేసవిలో తమ సినిమాలతో రిలీజ్ కు రెడీ అవుతున్నారు.
అయితే ఈ ఇద్దరి సినిమాల మధ్య చాలా గ్యాప్ ఉన్నా, రికార్డ్ ల విషయంలో మాత్రం
భారీగా పోటీ కనిపిస్తోంది. ఇప్పటికే సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్
కాగా, ఏప్రిల్ 8న ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో భారీగా రిలీజ్
చేయాడానికి రెడీ అవుతున్నారు.
ఇక మహేష్ హీరోగా తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవం ఆడియోను ఏప్రిల్ రెండో వారంలో రిలీజ్ చేసి మే లో సినిమా విడుదల కు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బిజినెస్ విషయంలో ఈ రెండు సినిమాల మధ్య పోటీ పక్కాగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫారిన్ మార్కెట్ లో గట్టి పట్టున్న మహేష్, ఓవర్సిస్ రైట్స్ విషయంలో పై చేయి సాధించాడు.
బ్రహ్మోత్సవం ఓవర్సీస్ రైట్స్ 13 కోట్లకు అమ్ముడవ్వగా, సర్థార్ గబ్బర్ సింగ్ 11.5 కోట్లతో సరిపెట్టుకున్నాడు. కానీ శాటిలైట్ రైట్స్ విషయంలో మాత్రం పవన్ ముందున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ శాటిలైట్ రైట్స్ 13 కోట్లకు అమ్ముడవ్వగా, బ్రహ్మోత్సవం రైట్స్ 11.5 కోట్లతో సరిపెట్టుకుంది. బిజినెస్ లోనే ఇంతగా పోటి పడుతున్న ఈ ఇద్దరు స్టార్స్, రిలీజ్ తరువాత కలెక్షన్ల విషయంలో ఎలాంటి రికార్డ్స్ నమోదు చూస్తారో చూడాలి.