మనలో
మనకు నచ్చని విషయాలు చాలానే ఉంటాయి. అవసరం, అవకాశం వచ్చినప్పుడు
వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటాం. రాశీ ఖన్నా కూడా అలా
ఎప్పట్నుంచో ఓ విషయంలో మార్పు కోసం ప్రయత్నిస్తోంది. అది ఎంతకీ సాధ్యం
కావడం లేదట. ఇంతకీ అదేంటి? అని ఆరా తీస్తే ‘సిగ్గు’ అని తేలింది. ‘‘చిన్నప్పట్నుంచి
నేను సిగ్గరినే. పెద్దయ్యాకా ఆ విషయంలో మార్పు రాలేదు. కథానాయికని
అయ్యాను కాబట్టి ఇక మెల్లమెల్లగా సిగ్గు, బిడియం లాంటివన్నీ దూరమవుతాయిలే
అని మొదట్లో భావించేదాన్ని. ఇప్పటికీ అది అలాగే ఉంది. నా దర్శకులు నేను
కలలోనూ హించని పాత్రలు సృష్టిస్తున్నారు. వాటిని విన్నప్పుడు ‘ఇంత
సిగ్గరిని, ఈ పాత్రల్లో నేనా? అసలు సాధ్యమేనా?’ అనుకొంటుంటా. దర్శకుల
నమ్మకం చూసి నేనూ ఓకే చెప్పేస్తుంటా. సెట్‌కి వెళ్లాక నేను ఆ పాత్రల్లో ఒదిగిపోతుంటా.
ఆ క్షణం నాకే కొత్తగా అనిపిస్తుంటుంది. తెరపై నన్ను నేను చూసుకొని ఎంత
ఆశ్చర్యపోతుంటానో మాటల్లో చెప్పలేను తెలుసా?’’ అని చెప్పింది రాశీ ఖన్నా.
ఆమె ప్రస్తుతం రామ్, గోపీచంద్‌తో కలిసి నటిస్తోంది
Saturday, June 11, 2016
చుక్కలు చూపించిన దీపిక!
అదో ప్రముఖ విమానయాన సంస్థ... తమకు ప్రచారకర్తగా ఓ స్టార్ హీరోయిన్
కావాలనుకున్నారు. దీపికా పదుకొనేని మించిన స్టార్ ఎవరుంటారు? అనుకున్నారు.
పైగా నిన్న మొన్నటి వరకూ బాలీవుడ్‌కే పరిమితమైన ఆమె ఇప్పుడిప్పుడే
హాలీవుడ్‌లో కూడా ఫేమస్ అయిపోతున్నారు. అందుకే ఇంటర్నేషనల్‌గా కూడా
వర్కవుట్ అవుతుందని వాళ్ల ఆలోచన. దీపిక క్రేజ్‌ని క్యాష్
చేసుకోవాలనుకున్నారు.
అంతే.. తమ ఎయిర్‌లైన్స్‌కి ప్రచారకర్తగా వ్యవహరించాలని అడిగారు. యాడ్
చిత్రీకరణ కోసం నాలుగు రోజులు కాల్షీట్ అడిగారు. దీపిక సంతోషంగా ఓకే
చెప్పేశారు. కానీ ఆమె అడిగిన పారితోషికం విని, ఆ కంపెనీ ప్రతినిధులు కళ్లు
తేలేశారు. ఏదో రెండు.. మూడు కోట్లు అడుగుతుందని లెక్కలేసుకున్నారట. కానీ,
దీపిక ఎనిమిది కోట్లు అడగడంతో షాక్ తిన్నారు. ఆ తర్వాత ఆ షాక్ నుంచి
తేరుకుని వేరే హీరోయిన్‌ని వెతికే పనిలో పడ్డారని సమాచారం.అనుష్కకి జోడీగా?
‘సరైనోడు’తో విలన్‌గా మారిన కథానాయకుడు ఆది పినిశెట్టి. ఆయన త్వరలోనే అనుష్కకి జోడీగా కనిపించనున్నట్టు సమాచారం. అనుష్క ప్రధాన పాత్రలో ‘భాగ్‌మతి’ చిత్రం తెరకెక్కబోతోంది. అశోక్.జి దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయిక ప్రాధాన్యంతో కూడిన ఈ చిత్రంలో అనుష్కకి జోడీగా ఒక కథానాయకుడు కనిపించాల్సి ఉందట. ఆ పాత్ర కోసం ఆదిని ఎంపిక చేసుకొన్నట్టు తెలుస్తోంది. మరి ఆ పాత్ర కూడా ప్రతినాయక ఛాయలతో కనిపిస్తుందా అనేది తెలియాల్సి వుంది. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ కూడా ఓ అతిథి పాత్రలో కనిపిస్తారని ప్రచారం సాగుతోంది.
Subscribe to:
Posts (Atom)