జీవితం, ప్రేమపట్ల
నిశ్చితాభిప్రాయాలున్న యువకుడతను. ధైర్యం, సమయస్ఫూర్తి అతని సొంతం. అలాంటి
యువకుడు వలచిన చిన్నదాని ప్రేమకోసం ఏం చేశాడు? ప్రేమప్రయాణంలో అతను
ఎదుర్కొన్న సంఘటనలేమిటి? అనే అంశాల సమాహారంతో చిన్నదాన నీ కోసం చిత్రాన్ని
రూపొందిస్తున్నాం అని చెప్పారు కరుణాకరన్. ఆయన దర్శకత్వంలో నితిన్ హీరోగా
నటిస్తున్న చిత్రం చిన్నదాన నీ కోసం. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై విక్రమ్‌గౌడ్
సమర్పణలో సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు. మిస్త్రీ
కథానాయిక. అనూప్ స్వరపరచిన పాటలు ఈ నెల 27న విడుదలకానున్నాయి. ఈ సందర్భంగా
నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్రానికి అనూప్ అద్భుతమైన సంగీతాన్నందించారు.
ప్రేమకథల్ని అందంగా తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన కరుణాకరన్ తనదైన శైలిలో
అన్ని వర్గాలను అలరించేలా చిత్రాన్ని తెరకెక్కించారు. ఆడియో వేడుకకు
పలువురు సినీహీరోలు హాజరవుతారు అన్నారు.