సింగపూర్‌లో చికిత్స పొందుతున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ తన ఆరోగ్యం బేషుగా వున్నదని స్పష్టం చేశారు. అభిమానుల ప్రార్థనలవల్ల తాను త్వరగా త్వరగా కోలుకున్నానని ఆయన అన్నారు. తన గురించి ఆందోళన చేయవద్దని విజ్ఞప్తి చేశారు. రజనీకాంత్ ఆసుపత్రినుంచి డిశ్చార్జి అయ్యారని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. అభిమానులకోసం త్వరలోనే రాణాగా వారి ముందుకు వస్తానని తెలిపారు.