Sunday, November 28, 2010
మొదటి వన్డే భారత్ 40 పరుగుల తేడాతో ఘన విజయం
భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో భారత్ 40 పరుగుల తేడా విజయం సాధించింది. 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 45.2 ఓవర్లలో 236 పరుగులకఁ అలౌట్ అయ్యింది. టేలర్ ఒక్కడే అర్థసెంచరీ చేశారు. మిగిత బ్యాట్‌మైన్ పెద్దగా రాణించలేకపోయారు. గుప్తిల్ 30, హౌ 9, విలియమ్‌సన్ 25, స్లైరిస్ 10, ఎలియట్ 5, హాప్కిన్స్ 16, టఫీ 4, మెక్‌కల్లమ్ 35, మిల్స్ 32 పరుగులకఁ ఔట్ అయ్యారు. భారత్ బౌలింగ్‌లో శ్రీశాంత్, యువరాజ్ సింగ్, అశ్విన్ తలో మూడు వికెట్లు తీసుకొఁ మిడిల్ ఆర్డర్‌ను కట్టడి చేశారు. నెహ్రాకఁ ఒక వికెట్ లభించింది.
అంతకముందు భారత్ 276 పరుగులకఁ ఆలౌటైంది. విరాట్ కోహ్లీ ( 105 )అద్బుత సెంచరీ చేశాడు.టాస్ ఓడి బ్యాటింగ్‌కఁ దిగిన భారత్ ఓపెనర్లు విజరు 29, గంభీర్ 38, పరుగులకఁ ఔటయ్యారు. కోహ్లీ యువరాజ్‌తో కలసి మూడు వికెట్‌కఁ 88 పరుగుల స్కోరు అందించారు. యువరాజ్ 42 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అ తర్వాత వచ్చిన బ్యాట్‌మైన్‌లు పెద్దగా రాణించలేకపోయారు. రైనా 13, వర్థమాన్ షా 4, ఆశ్విన్ 0, నెహ్రా 0, శ్రీశాంత్ 4, యుసుఫ్ పఠాన్ 29 పరుగులు చేశారు.న్యూజిలాండ్ బౌలర్లలలో మెకే నాలుగు, మిల్స్ మూడు, టఫే రెండు వికెట్లు దక్కాయి.
Subscribe to:
Posts (Atom)