లవర్‌బోయ్ ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా..ప్రేమకథకు యాక్షన్ జోడించిన చిత్రాలలో నటిస్తున్నా. కొత్త సంవత్సరంలో సరికొత్తగా మీ ముందుకొస్తున్నా’’ అన్నారు తరుణ్. ఆదివారం ఈ యువహీరో పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో పాత్రికేయులతో ముచ్చటించారు. తాజా సినిమాల గురించి మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నా. రెండూ యాక్షన్ కథాంశం ఉన్నవే. చక్రి సంగీతం అందిస్తున్నారు. ‘అనుచరుడు’ 3పాటల చిత్రీకరణ సహా నాలుగు రోజుల షూటింగ్ మిగులుంది. నాపై యాక్షన్ సన్నివేశాలు పూర్తి చేస్తున్నారిప్పుడు. తదుపరి ఓ పాటను సెట్‌లో, మిగతావి హైదరాబాద్ పరిసరాల్లో తెరకెక్కిస్తారు. ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారు. మరో సినిమా ‘యుద్ధం’ 30శాతం పూర్తయింది. అనుచరుడు తర్వాత మిగతా చిత్రీకరణ సాగుతుంది.
అలాగే కొన్ని స్క్రిప్టు దశలో ఉన్నాయి’’ అన్నారు. సినిమాల ఎంపిక విషయమై మాట్లాడుతూ -స్క్రిప్టు నచ్చి, పాత్రకు సూటవుతానని భావిస్తే ఏ తరహా చిత్రంలోనైనా చేస్తానని అన్నారు. వెంకటేష్ సారథ్యంలో ‘సిసిఎల్ సీజన్ 2’ క్రికెట్ కప్‌ను కచ్ఛితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు తరుణ్. ఈ సారి టాలీవుడ్ టీమ్ మరింత బలంగా ఉందన్నారు. మ్యాచ్ ఫలితం ఏదైైనా..ఆటతో అందరికీ వినోదాన్ని పంచుతామన్నారు. పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు సమాధానంగా ‘దానికింకా టైముంది. రెండేళ్ల సమయం పట్టొచ్చు’ అన్నారు. తన పుట్టినరోజు వేడుకల కోసం విచ్చేసిన అభిమానులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుకలు జరిగాయి.