అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ మృతి చెందాడు.అజ్మలుద్దీన్ మృతదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని వారి నివాసానికి తరలించారు. మృతదేహాం ఇంటికి చేరుకోగానే కుటుంబసభ్యులు, బంధువులు భోరున విలపించారు. ఈనెల 11న పుప్పాలగూడ వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై జరిగిన ప్రమాదంలో గాయపడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయాజ్‌తోపాటు గాయపడిన అజ్మల్ ప్రమాదం జరిగిన రోజు సాయంత్రమే మరణించాడు. డాక్టర్లు ఆయనకు ఆరు రోజులపాటు కాపాడడానికి సకల ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అజ్మల్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.