తెలుగు, తమిళంతోపాటు బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అసిన్ మైక్రోమ్యాక్స్ సహవ్యవస్థాపకుడు రాహుల్ శర్మను ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వెడ్డింగ్ రిసెప్షన్‌ను ముంబయిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ నటులు అక్షయ్‌కుమార్, సుస్మితా సేన్, జాక్వెలిన్ ఫెర్నాండెంజ్, ఖుష్భు, రానా, వెంకటేశ్, శిల్పా శెట్టి, రాజ్‌కుంద్ర, ప్రీతీ జింటా, మనీష్ పాల్, మాధవన్ తదితరులు హాజరై సందడి చేశారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను అసిన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
Monday, January 25, 2016
అసిన్ వెడ్డింగ్ రిసెప్షన్ అదుర్స్
తెలుగు, తమిళంతోపాటు బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అసిన్ మైక్రోమ్యాక్స్ సహవ్యవస్థాపకుడు రాహుల్ శర్మను ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వెడ్డింగ్ రిసెప్షన్‌ను ముంబయిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ నటులు అక్షయ్‌కుమార్, సుస్మితా సేన్, జాక్వెలిన్ ఫెర్నాండెంజ్, ఖుష్భు, రానా, వెంకటేశ్, శిల్పా శెట్టి, రాజ్‌కుంద్ర, ప్రీతీ జింటా, మనీష్ పాల్, మాధవన్ తదితరులు హాజరై సందడి చేశారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను అసిన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
రజనీ, సైనా, సానియాకు 'పద్మ' అవార్డులు
తెలుగు తేజాలు సానియా మీర్జా, సైనా నెహ్వాల్ , తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తదితర ప్రముఖులను పద్మ అవార్డులు వరించాయి. రజనీకాంత్ , ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు పద్మవిభూషణ్.. సైనా, సానియా, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిలకు పద్మభూషణ్ అవార్డులను అందజేయనున్నారు. సోమవారం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 118 మందికి పద్మఅవార్డులను ప్రకటించగా, 10 మందికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్ అవార్డులను అందజేయనున్నారు. ప్రముఖ నృత్యకళాకారిణి యామిని కృష్ణమూర్తి, పండిట్ రవిశంకర్, రిలయన్స్ ఇండస్ట్రీ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీలకు పద్మవిభూషణ్ అవార్డును ప్రధానం చేయనున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళికి పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. అవార్డులకు ఎంపికైన వారి వివరాలు..
పద్మవిభూషణ్: రజనీకాంత్, రామోజీ రావు, జగ్ మోహన్ (జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్), పండిట్ రవిశంకర్, యామిని కృష్ణమూర్తి, గిరిజా దేవి (సంగీతం), విశ్వనాథన్ శాంతా, ధీరూభాయ్ అంబానీ (మరణాంతరం), డాక్టర్ వాసుదేవ్ ఆత్రే (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), అవినాశ్ దీక్షిత్
పద్మభూషణ్: సానియా మీర్జా, సైనా నెహ్వాల్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, అనుపమ్ ఖేర్, ఉదిత్ నారాయణ్, వినోద్ రాయ్ (మాజీ కాగ్), బ్రిజేందర్ సింగ్, బర్జీందర్ సింగ్, స్వామి తేజోమయనంద, రామ్ సుతార్, ప్రొఫెసర్ రామనుజ తాతాచార్య, హీస్నమ్ కన్హేలాల్
పద్మశ్రీ: రాజమౌళి, ప్రియాంక చోప్రా, అజయ్ దేవగన్, ఉజ్వల్ నికమ్ (న్యాయవాది), అవస్థీ
Subscribe to:
Posts (Atom)