ప్రేమ విఫలమైతే బాధ పడకూడదంటున్నారు నటి కాజల్‌అగర్వాల్. తన వ్యక్తిగత అనుభవమో ఏమోగానీ ఈ భామ ప్రేమ గురించి చాలానే చెప్పారు. ఈ తరం యువత ప్రేమలో పడడం సర్వసాధారణంగా మారిందన్నారు. అయితే అందరి ప్రేమ సక్సెస్ కావడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగని ప్రేమలో విఫలమైన వారు ఇక జీవితమే లేదని బాధ పడకూడదన్నారు. అది కరెక్ట్ కాదనీ, అలాంటి మానసిక వేదన నుంచి బయట పడాలన్నారు. ప్రేమించడం, ప్రేమించబడడం సహజం అన్నారు.
అయితే అలా ప్రేమించుకున్న వారందరూ పెళ్లి పీటలెక్కడం లేదని, సామాజిక పరమైన అంశాలు, తల్లిదండ్రుల వ్యతిరేకత వంటి అంశాలు కొందరి విషయంలో ఆటంకంగా మారుతున్నాయన్నారు. ప్రేమలో పడడంలానే ప్రేమలో విఫలం అవడం సాధారణ విషయమేనన్నారు. ప్రేమలో పడ్డా కూడా మనం ఏమిటన్నది మరచిపోకూడదని, మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదని అన్నారు. మన ప్రాధాన్యతను ప్రేమ తగ్గించకూడదన్నారు. ప్రేమించిన వ్యక్తే జీవితం అనే స్థాయికి వెళ్లరాదని... ఒక వేళ ప్రేమలో విఫలమైనా అందుకు బాధ పడకూడదన్నారు. దాని నుంచీ వెంటనే బయటపడగలం అన్నారు. తాను ఇప్పటి వరకూ ఎవరినీ ప్రేమించలేదన్నారు.
పెళ్లికి కూడా ఇంకా చాలా సమయం ఉంది అని అంటున్న కాజల్‌అగర్వాల్ నటిగా కోలీవుడ్‌లో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం జీవా సరసన క వలైవేండామ్ చిత్రంలోనూ విక్రమ్‌కు జంటగా గరుడా చిత్రంలోనూ నటిస్తున్నారు. తాజా సమాచారం ఏమిటంటే అజిత్ 57వ చిత్రంలో నటించే అవకాశం ఈ బ్యూటీకి వచ్చిందనీ. ఇటీవల పూజా కార్యక్రమాలను జరుపుకున్న అజిత్ చిత్రంలో అనుష్క కథానాయకి అన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. మరి ఆమె పాత్రలో కాజల్ నటిస్తారా? లేక ఇందులో మరో నాయకి పాత్రను పోషించనున్నారా? అన్న క్లారిటీ త్వరలోనే రావచ్చు. మరో విషయం ఏమిటంటే అజిత్‌తో కాజల్ ఎన్నై అరిందాల్ చిత్రంలోనే రొమాన్స్ చేయాల్సింది. అయితే అప్పట్లో ఆ అవకాశం చివరిలో అనుష్కను వరించింది.