సినిమాలకి కలిసొచ్చే సీజన్లలో ఒకటైన దసరాకి ప్రతి ఏటా భారీ సినిమాలు అనేకం విడుదలవుతుంటాయి. ఈ సారి కూడా దసరాకి భారీ చిత్రాలు విడుదలకు సిద్దంగా వున్నాయి. ఏకంగా అరడజనుకి పైగా చిత్రాలు వస్తున్నాయి. ముందుగా దసరా సందర్భంగా మహేష్ బాబు ఓపెనింగ్ చేస్తున్నాడు. దూకుడు సినిమా తర్వాత, బాలకృష్ణ చిత్రం శ్రీరామరాజ్యం వస్తుంది. ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి కూడా దసరాకే విడుదల సిద్దంగా వున్నాయి అని నిర్మాతలు చెబుతున్నారు. ఇవి కాకా గోపిచంద్ ( మొగుడు ), నాగార్జున ( రాజన్న ), వెంకటేష్ ( బాడీగార్డ్) విడుదలకు సిద్దంగా వున్నాయి. ఈ సారి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.