నవంబర్ 10: అన్ని ఒకేరకమైన అంకెలతో, ఎటు నుంచి చూసినా ఒకేలాగ కనిపించే అరుదైన తేదీ 11-11-11.. నేడు అంటే శుక్రవారం ఈ తేదీకి వేదిక కానుంది. వందేళ్లకు ఒక్కసారి మాత్రమే ఇలాంటి తేదీ దర్శనమిస్తుంది. అందులోనూ 11-11-11 తేదీన 11గంటల, 11నిమిషాల. 11 సెకన్లు సమయం మరీ ప్రత్యేకం. అరుదైన అంకెల గారడీ చుట్టూ ఎన్నో అపోహలు, మూఢనమ్మకాలు ముసురుకున్నాయి. ఈ ప్రత్యేక తేదీన ఔత్సాహికులు విహహాలు, వేడుకలు జరుపుతుండగా, హిందూ సంప్రదాయం ప్రకారం ఈ సంఖ్య అంతగా అచ్చిరాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. 11-11-11 తరహాలో తదుపరి అంకెలు (22-22-22) కాల్యెండర్‌లో లేకపోవడమే ఇందుకు కారణమని కొన్ని వెబ్‌సైట్లు ప్రవచిస్తున్నాయి. గతం ఈ తేదీ వచ్చినప్పుడు, అంటే 1911, నవంబర్ 11న పర్యావరణంలో అనూహ్య మార్పులు సంభవించాయి