మాంచి ఘుమఘుమలాడే భోజనం ముందుంటే... లొట్టలేసుకుంటూ తినేస్తారు తప్ప ఎవరూ
చూస్తూ కూర్చోరు కదా! కానీ, హీరోయిన్ల పరిస్థితి ఇందుకు భిన్నమనే చెప్పాలి.
ముందున్న ప్లేటులో ఫుడ్ నోరూరిస్తున్నా.. ఇది తింటే కొవ్వు పెరుగుతుందేమో?
ఇందులో కేలరీలు ఎన్నున్నాయో? రేపు జిమ్‌లో ఎంతసేపు ఎక్స్ట్రా వర్కౌట్స్
చేయాలో? అని సవాలక్ష ప్రశ్నలతో తినడానికి భయపడతారు. కానీ, రకుల్‌ప్రీత్
సింగ్ అలాంటి భయాలేవీ పెట్టుకోకుండా గుజరాతీ ఫుడ్‌ను ఫుల్లుగా
లాగించేశారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబుకు జోడీగా నటిస్తున్న
సినిమా షూటింగ్ కోసం రకుల్ అహ్మదాబాద్ వెళ్లారు.
షూటింగ్‌కి ప్యాకప్ చెప్పేసిన వెంటనే... వ్యక్తిగత సహాయక బృందంతో కలసి
దగ్గరలోని ఓ రెస్టారెంట్‌కి వెళ్లారు. సంప్రదాయ గుజరాతీ వంటకాలు
బాగున్నాయని ఫుల్‌గా తినేశారు. మరి, వర్కౌట్స్ సంగతేంటి? ఆల్రెడీ జిమ్‌లో
ఉన్నారా! ఏంటి? అనడిగితే... రకుల్ గట్టిగా నవ్వేశారు. ‘‘ఓ పక్క ఫుడ్ దారి
ఫుడ్‌ది. మరోపక్క వర్కౌట్స్ దారి వర్కౌట్స్‌ది’’ అన్నారు. ఏం తిన్నా, ఎంత
తిన్నా వెయిట్ పెరగని రకుల్ స్లిమ్ బ్యూటీ వెనుక సీక్రెట్ ఇదన్నమాట!