అంతా యువతీయువకులే ఉన్న టీమ్‌తో పనిచేస్తే హుషారొస్తుంది. ఫలితమూ అంతే బావుంటుంది’’ అంటున్నారు ‘కొలవెరి..డి’ ఫేం, ‘3’ సంగీతదర్శకుడు అనిరుధ్. 21ఏళ్ల ఈ యువకుడు ఒకే ఒక్క ‘కొలవెరి..’తో ప్రపంచ ప్రసిద్ధ సంగీతదర్శకుడైపోయాడు. తెలుగు, తమిళ్, హిందీలో నేడు వరుస అవకాశాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటిస్తూ-‘ఐశ్వర్య దర్శకత్వంలో ధనుష్ హీరోగా ‘3’ సినిమాకి సంగీతం అందిస్తున్నా. ఆల్బమ్‌లో రెండు పాటలు కూడా పాడాను. ‘కొలవెరి...’కి కోరస్ పాడాను. అసలు ‘కొలవెరి...’ అనేది ప్రేమలో విఫలమైనప్పుడు..విచారంలో పాడుకునే పాట. రొటీన్‌కి భిన్నంగా ఉండాలని బాణి కొత్తగా వినిపించాను. హాస్యం, విచారం ఒకే పాటలో ఉండేలా ట్యూన్ కట్టడం చాలా కష్టం. ప్రయత్నించి సక్సెసయ్యాను. అలాగే ‘3’ సినిమాకోసం ముందస్తు ప్రణాళికలెన్నో. సెట్స్‌కెళ్లడానికి ముందు 13 లఘుచిత్రాలు మేమంతా కలిసి రూపొందించాం. అందులోంచి ఓ లఘుచిత్రాన్ని పూర్తి స్థాయి ఫీచర్ సినిమా ‘3’ గా తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. ఏ.ఆర్.రెహ్మాన్‌ని విపరీతంగా అభిమానించే అనిరుధ్..బికాం పూర్తిచేసి లండన్ ట్రినిడాడ్ సంగీతకళాశాలలో మ్యూజిక్ కోర్స్ పూర్తిచేశారు. కర్నాటిక్ సంగీతంలోనూ మంచి ధిట్ట.