'నవంబర్ 26న మా పెళ్ళంట. ఇది నిజంగా నవ్వు
తెప్పించే వార్త. మేమింకా ముహూర్తమే పెట్టుకోలేదు. నా పెళ్ళి తేదీపై మీడియా
గందరగోళం సృష్టిస్తోంద'ని అంటోంది అశిన్. నవంబర్ 26న ఢిల్లీలో అశిన్
పెళ్ళంటూ మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఖరాఖండిగా చెప్పింది.
అంతేకాదు 'అంగీకరించిన ప్రాజెక్టులు, కాంట్రాక్టులు ఈ ఏడాది చివరి నాటికి
పూర్తవుతాయి. ఆ తర్వాతే మా పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి ఎప్పుడనేది నేను, మా
పెద్దలు చెప్పేవరకు మీడియావాళ్ళు ఓపిక పట్టండి' అంటూ ఘాటుగా స్పందించింది.
మైక్రో మ్యాక్స్ సహస్థాపకుడైన రాహుల్‌శర్మను అశిన్ పెళ్ళి చేసుకోబోతున్న
విషయం విదితమే. ఇటీవల జరిగిన అశిన్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో రాహుల్ శర్మ
ఆరుకోట్ల విలువైన డైమండ్ రింగ్‌ను బహూకరించారు కూడా.