అఖిల్ అక్కినేనిని హీరోగా పరిచయం చేస్తూ వి.వి.వినాయక్ దర్శకత్వంలో
శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో నితిన్ నిర్మిస్తున్న
చిత్రం 'అఖిల్'. అనూప్ రూబెన్స్, ఎస్.ఎస్.థమన్ సంయుక్తంగా
సంగీతమందించిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని
గచ్చిబౌలి స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగింది. తొలుత థియేట్రికల్
ట్రైలర్‌ను అక్కినేని నాగార్జున, మహేష్ ఆవిష్కరించారు. అనంతరం అక్కినేని
నాగార్జున ఆడియోను రిలీజ్ చేసి విచ్చేసిన అతిథులందరికీ అందజేశారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ,''అఖిల్ సినిమాలో అంత బాగా కనిపించడానికి కారణం వినాయక్, నితిన్, సుధాకర్‌రెడ్డి సహా అందరి కృషి ఉంది. కృష్ణగారితో 'వారసుడు' సినిమా చేశాను. ఇప్పుడు ఆయన వారసుడు మహేష్ నా వారసుడి సినిమా ఆడియో లాంచ్ చేసినందుకు థ్యాంక్స్. అభిమానులతో అనుబంధం 75 ఏళ్ళ క్రితమే మొదలైంది. విజయదశమి కానుకగా అక్టోబర్ 22న సినిమాను విడుదల చేస్తున్నాం' అని అన్నారు.ఒక హీరోని ప్రెజంట్ చేయడమంటే ఎవరైనా వినాయక్‌గారి తర్వాతే. ఇండిస్టీకి మరో పెద్ద హీరోని ఇచ్చినందుకు వినాయక్ గారికి థ్యాంక్స్. ఏఎన్నార్ లివ్స్ ఆన్. ఈరోజు అక్కినేని నాగేశ్వరావుగారు చాలా హ్యాపీగా ఉండుంటారు. ఈ సినిమా సూపర్‌డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా' అని మహేష్ చెప్పారు. అఖిల్ మాట్లాడుతూ,'నాకు చీకటిలో టార్చ్‌లైట్‌గా వినాయక్ గారు కనిపించారని నా లాంచింగ్ రోజే చెప్పాను.
అనూప్, థమన్‌లకు చాలా థాంక్స్. అమోల్ రాథోడ్‌గారు ఒక కొత్త యాంగిల్‌లో చూపించారు. నేను కష్టపడలేదు కానీ నా చుట్టూ ఉన్నవారు బాగా కష్టపడ్డారు. ఈ సినిమాకి సుధాకర్‌రెడ్డిగారు బ్యాక్‌బోన్‌లా ఉండి నన్ను హైట్స్‌లో పెట్టి సినిమా తీశారు. వినాయక్ గారు సినిమాకి గుండెలా ఉన్నారు. నితిన్ నా కాలర్ పట్టుకుని ఈ సినిమా చేయిం చాడు. సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్' అని చెప్పారు. ''ఈ సినిమా పెద్ద సెన్సేషనల్ హిట్ అవుతుందని నేను నాగార్జునగారికి ప్రామీస్ చేశాను. ఆ ప్రామీస్‌ను 100% నిలబెట్టుకున్నానని రేపు ప్రేక్షకులు కూడా చెబుతారు. సినిమా తీసిన వాడిగా అఖిల్ సూపర్‌స్టార్ అవుతాడని చెబుతున్నాను' అని వి.వి.వినాయక్ అన్నారు.