‘నేను శైలజ’ చిత్రంతో తెలుగు
ప్రేక్షకులకు పరిచయమైన కథానాయిక
కీర్తీసురేశ్ పవర్‌స్టార్
పవన్‌కల్యాణ్ సరసన నటించే
ఛాన్స్ కొట్టేసింది. ఈ విషయాన్ని
కీర్తీసురేశ్ స్వయంగా తన ట్విట్టర్
ఖాతా ద్వారా ప్రకటించారు. తన
తర్వాతి చిత్రం పవన్‌కల్యాణ్,
త్రివిక్రమ్‌లతో కావడం చాలా
సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్
పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న
ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం
సమకూరుస్తున్నారు. తెలుగులో
ఆయన స్వరాలు అందిస్తున్న తొలి
చిత్రమిది. పవన్-త్రివిక్రమ్
కలయికలో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి
దారేది’ ఘన విజయాలు సాధించడంతో
ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు
ఉన్నాయి. డిసెంబరు నుంచి ఈ చిత్రం
షూటింగ్ ప్రారంభించనున్నట్లు
సమాచారం.
ప్రస్తుతం పవన్‌కల్యాణ్ ‘కాటమరాయుడు’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కీర్తీసురేశ్ ‘భైరవ’, ‘నేను లోకల్’ చిత్రాల్లో నటిస్తున్నారు.
ప్రస్తుతం పవన్‌కల్యాణ్ ‘కాటమరాయుడు’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కీర్తీసురేశ్ ‘భైరవ’, ‘నేను లోకల్’ చిత్రాల్లో నటిస్తున్నారు.