ముంబయికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్
ఇంజనీర్‌ని మిల్కీబ్యూటీ తమన్నా
వివాహం చేసుకుంటోందని, పెళ్లి
తరువాత ఆమె సినిమాలు చేయడం మానేస్తుందని
ఇటీవల వార్తలు వెలువడ్డాయి.
ఈ వార్తలన్నీ అవాస్తవమని తమన్నా
తేల్చి చెప్పారు.
తాను ఈ వార్తలు చదివిన వెంటనే ట్విట్టర్ ద్వారా ఖండించానని, అయినప్పటికీ కొందరు తన పెళ్లిపై స్టోరీలు రాస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో మూడు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నానని తెలిపారు. అసలు ఈ వార్త ఎలా ప్రచారంలోకి వచ్చిందో తనకు తెలియడం లేదని చెప్పారు తమన్నా. తాను ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదని, పెళ్లి వార్త ఏమైనా ఉంటే మొదట అందరికీ చెబుతానన్నారు.