ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.
రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా
తెరకెక్కిస్తున్న ‘బాహుబలి
2’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం
పతాక సన్నివేశాల చిత్రీకరణను
జరుపుకుంటోంది. ఈ చిత్రం విడుదల
కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు
చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అయితే నవంబరులో చిత్రం షూటింగ్
పూర్తి కానుందని సమాచారం. హీరో
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా
అక్టోబరు 23న చిత్రం ట్రైలర్‌ను
విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
‘బాహుబలి’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా
మంచి వసూళ్లను రాబట్టడంతో దానికి
కొనసాగింపుగా తీస్తున్న ఈ చిత్రంపై
భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘బాహుబలి’
ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదలైన
24 గంటల్లోనే దాదాపు 40 లక్షల మంది
వీక్షించడం గమనార్హం.
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. కీరవాణి చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ‘బాహుబలి 2’ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. కీరవాణి చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ‘బాహుబలి 2’ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.