టాలీవుడ్ సూపర్‌స్టార్ కృష్ణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. వెన్ను నొప్పి కారణంగా గత నాలుగు రోజుల క్రితమే కృష్ణ హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రసుత్తం ఆయన కోటుకుంటున్నారనీ, చిన్నపాటి సర్జరీ కూడా జరిగిందనీ, డాక్టర్ చెప్పారు. రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి అవుతారనీ కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణ అనారోగ్యం వార్త బయటకు తెలియగానే అయన అభిమాన్యులు అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కుటుంబ సభ్యులనుంచి ఆయన కోలుకుంటున్నారన్న ప్రకటన రావడంతో అభిమానుల్లో కొంతమేర ఆంతోళన తగ్గింది. కృష్ణ 300పైగా సినిమాల్లో నటించాడు.