టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు అర్జెంట్‌గా ఓ
కూతురు కావాలట. అదీ మూడు రోజుల్లోనే. 'శనివారం లోగా నాకో బేబీ కావాలి.
ఇప్పుడెలా అంటూ..' ట్వీట్ చేశారు సమంత. ఇంత అర్జెంట్‌గా సమంతకి కూతురి
అవసరం ఎందుకొచ్చిందో ఓసారి చూద్దాం..ప్రస్తుతం 'బ్రహ్మోత్సవం' షూటింగ్‌లో
బిజీగా ఉన్న సమంత.. మహేష్‌బాబు తనయ సితారతో గడిపేందుకు శనివారం సమయాన్ని
కేటాయించింది. అయితే సితార తనతో ఆడుకోవడానికి సమంత కూతురిని కూడా
తీసుకురమ్మని రిక్వెస్ట్ చేసిందట. దీంతో ఏం చేయాలో తెలీయక సమంత పై విధంగా
ట్వీట్ పెట్టింది. 'శనివారం సితారతో ఆడుకోవడానికి డేట్ ఫిక్స్ చేశా.
కాని సితారకి నా కూతురు కూడా కావాలంట. శనివారంలోగా ఓ బేబీని ఎలా ఎరేంజ్
చేయాలి' అంటూ సితారతో దిగిన ఓ ఫోటోను సరదాగా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది
సమంత. 'బ్రహ్మోత్సవం'తోపాటు సమంత నితిన్ సరసన 'అ...ఆ' చిత్రంలోనూ
నటిస్తున్న విషయం విదితమే.
Wednesday, March 16, 2016
రాజకుమారిగా కాజల్
‘మగధీర’ చిత్రంలో రాజకుమారి మిత్రవిందగా అందరినీ ఆకట్టుకొంది నటి కాజల్.
ఇప్పుడు ఈ భామ తన తరువాతి చిత్రం ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లోనూ రాజకుమారిగా
కనిపించనుందట. కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ...
సర్దార్ సెట్‌లోని ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. సర్దార్ గబ్బర్‌సింగ్,
రాజకుమారి అర్షి అంటూ హ్యాష్‌టాగ్‌లు పెట్టారు.
కాజల్ తొలిసారి ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌కు జంటగా నటించారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ నెల 20న చిత్రం ఆడియో విడుదల వేడుకలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాజల్ తొలిసారి ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌కు జంటగా నటించారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ నెల 20న చిత్రం ఆడియో విడుదల వేడుకలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Subscribe to:
Posts (Atom)