సెలబ్రిటీ
వారసులుగా సినీ పరిశ్రమలో అడుగుపెడితే
వారికి ప్రత్యేకమైన గౌరవం దక్కుతుంది.
అవకాశాలు.. పాపులారిటీ సులభంగా
వస్తాయి. అయితే దాన్ని నిలుపుకోవడం
మాత్రం వారి ప్రతిభపై ఆధారపడి
ఉంటుంది. సినీ నేపథ్యమున్న కుటుంబం
నుంచి వస్తే చాలా ఉపయోగాలు..
వెసులుబాటులుంటాయి. కానీ.. సోనమ్
కపూర్ మాత్రం అదే ఇబ్బందులను
తెచ్చిపెడుతోందని తెగ బాధపడిపోతోంది.
‘‘నా తండ్రి వల్ల నేను చాలా సినిమాల్లో నటించే అవకాశం కోల్పోయాను. ‘ప్రేమ్ రతన్ ధన్‌పాయో’ సినిమాని తీసుకోండి. మొదట ఈ చిత్రంలో సల్మాన్ నాతో నటించడానికి ఒప్పుకోలేదు. ‘అనిల్ కపూర్ నా సన్నిహిత స్నేహితుడు. అలాంటిది అతని కుమార్తెతో నేను ఎలా రొమాన్స్ చేయగలను?’ అని సల్మాన్ అన్నాడు. అతికష్టం మీద నటించేందుకు ఒప్పుకున్నాడు. అలాగే ‘దర్శకురాలు ఫరాఖాన్ మా అమ్మకు స్నేహితురాలు. కానీ ఫరాఖాన్ చిత్రాల్లో ఒక్క దాంట్లో కూడా నేను నటించలేదు. చిన్నప్పట్నుంచి తెలిసిన అమ్మాయిని కాబట్టి తనకు నేను నటిగా కనిపించకపోవచ్చు’ అని ఆవేదన వ్యక్తం చేస్తోంది సోనమ్.