ఈ జనరేషన్ నటులు కేవలం నటులగానే మిగిలిపోవాలనుకోవటం లేదు. అందుకే ఇతర రంగాల
మీద కూడా దృష్టి పెడుతున్నారు. ముఖ్యం మన హీరోలు హీరోయిన్లు అప్పుడప్పుడు
సింగర్ అవతారం ఎత్తుతూ గాయకులకు పోటీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ
విషయంలో కామెడీ స్టార్ లు కూడా వెనక్కి తగ్గటం లేదు. ఇటీవల 'లచ్చిందేవి ఓ
లెక్కుంది' సినిమా కోసం జయప్రకాష్ రెడ్డి పాట పాడగా ఇప్పుడు ఈ లిస్ట్ లో
అలీ కూడా చేరిపోయాడు.
మరో అడుగు ముందుకేసిన అలీ పాడ పాడటమే కాదు, తన పాడే పాటను తానే రాశాడు
కూడా. ఎందుకంటే ఆ పాట తను మాత్రమే రాయగలడు. ఎంద చాట అంటూ విచిత్రమైన పదాలతో
అలరించే అలీ అదే భాషలో పాట పాడాడు. అక్కినేని ఫిలిం స్కూల్ స్టూడెంట్
చునియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పడేసావే సినిమా కోసం అలీ పాట రాసి,
పాడాడు. అనూప్ రుబెన్స్ సంగీత దర్శకత్వంలో రూపొందించిన ఈ పాటను ఇప్పటికే
రికార్డ్ చేశారు.