హీరోయిన్ ప్రియమణి ఘాటింగ్ స్పాట్‌కు వెళ్తున్న వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. కన్నడంలో పునీర్ రాజ్‌కుమార్ సరసన ప్రియమణి ' అన్నా బాండ్ ' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఘాటింగ్ కోసం బెంగుళూరుకు దగ్గరలోని ముత్తత్తి దుర్గ అటవీ ప్రాతానికి ప్రియమణితో పాటు ఆమె సెక్రటరీ, మేనేజర్, స్నేహితురాలు కలిసి కారులో బయలుదేరారు. అటవీ ప్రాంతం ద్వారా వెళ్తున్న సమయంలో వీరి వాహనాన్ని మరో వాహనం ఓవర్ టేక్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రియమణి ప్రయాణం చేస్తున్న వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలో పడింది. అయితే ఎవరికి గాయాలు కాలేదు.