టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ సూపర్ స్టార్ లకు కూడా చుక్కలు
చూపిస్తున్నాడు. ముఖ్యంగా ఎండార్స్ మెంట్ల విషయంలో ఇప్పటికే సౌతిండియాలో
టాప్ ప్లేస్ లో ఉన్న మహేష్ బాబు ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలకు కూడా పోటీ
ఇస్తున్నాడు. ఇప్పటి వరకు సౌత్ ఇండియాకు సంబంధించిన యాడ్స్ మాత్రమే
చేస్తున్న ఈ రాజకుమారుడు త్వరలోనే నేషనల్ యాడ్స్ లో మెరిసేందుకు రెడీ
అవుతున్నాడు.
ప్రస్తుతం ఆమిర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న పలు కంపెనీలు,
ఆయనతో తమ అగ్రిమెంట్ ముగియటంతో, మహేష్ తో ఒప్పందం కుదుర్చుకునేందుకు రెడీ
అవుతున్నాయట. శ్రీమంతుడు సినిమాతో భారీ కలెక్షన్లతో పాటు ఓవర్ సీస్ లో తన
స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. దీంతో పలు కంపెనీలు మహేష్ మీద దృష్టి
పెట్టాయి. ఇప్పటికే నెంబర్ పరంగా అత్యధిక బ్రాండ్ లకు అంబాసిడర్ గా
వ్యవహరిస్తున్న మహేష్.. నేషనల్ యాడ్స్ లో కూడా సత్తా చాటితే సంపాదన పరంగా
కూడా రికార్డ్ సృష్టించటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టినందుకు క్షమాపణలు చెప్పాల్సిందిగా
సుప్రీంకోర్టు బాలీవుడ్ అగ్ర నటుడు గోవిందాకు సూచించింది. 'మీరు పెద్ద
హీరో. పెద్ద హృదయాన్ని కూడా చాటండి' అని గోవిందాకు సలహా ఇచ్చింది. 2008లో
తనను చెంపదెబ్బ కొట్టి.. బెదిరించాడని సంతోష్‌రాయ్ అనే వ్యక్తి
సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇదే విషయమై గతంలో ఆయన వేసిన పిటిషన్‌ను
బొంబాయి హైకోర్టు కొట్టివేసింది. నేరపూరిత ఉద్దేశంతోనే గోవిందా ఆయనను
చెంపదెబ్బ కొట్టాడనటానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ పిటిషన్‌పై
సోమవారం విచారణ జరిపిన జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం
వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది.
రాయ్‌ను గోవిందా చెంపదెబ్బ కొడుతున్న వీడియోను మొబైల్‌లో చూసిన ధర్మాసనం..
ఆయనకు గోవిందా క్షమాపణ చెప్పాలని సలహా ఇచ్చింది. సినీతారలు బహిరంగ
ప్రదేశాల్లో కొట్లాటలకు దిగకూడదని సూచించింది. రీల్‌లైఫ్‌లో చేసినట్టు
ఇష్టం వచ్చినట్టు రియల్‌లైఫ్‌లో చేయడం సరికాదని హితవు పలికింది. 'మేం మీ
సినిమాలను చూస్తాం. కానీ మీరు ఎవరినైనా నిజంగా చెంప ఛెళ్లుమనిపిస్తే
సహించం' అని జస్టిస్ వీ గోపాల గౌడతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు
తదుపరి విచారణను ఫిబ్రవరి 9వ తేదీకి వాయిదా వేసింది.
తనకేం కాలేదని, తాను బాగానే ఉన్నానని హీరోయిన్ హన్సిక తెలిపింది. తాను
పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, కంగారు పడాల్సిన పనిలేదని ట్విటర్ ద్వారా
సోమవారం వెల్లడించింది. హన్సిక రక్త పరీక్ష చేయించుకుందని తెలియడంతో ఆమె
సన్నిహితులు, అభిమానులు ఆందోళన చెందారు. 'ఏం జరిగింది. ఏమైనా సీరియస్సా'
అంటూ ట్వీట్లు చేశారు. విశ్రాంతి తీసుకోవాలని, ఆరోగ్యమే ముఖ్యమని ఆమెకు
సలహా ఇచ్చారు. అయితే రెగ్యులర్ చెకప్ లో భాగంగానే టెస్టు చేయించుకున్నానని హన్సిక వివరణ
ఇచ్చింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది.
పరీక్ష కోసం రక్తం తీసుకున్నప్పుడు తాను గట్టిగా ఏడ్చానని, తన తల్లి ఎంతో
ఓపికగా సముదాయించిందని అంతకుముందు హన్సిక ట్వీట్ చేసింది. దీంతో కంగారు
పడిన అభిమానులు ఆమె ఆరోగ్యంపై ప్రశ్నలు సంధించారు. ప్రస్తుతం హన్సిక పలు
తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.