సోషల్
మీడియా యాప్‌లో ఎక్కువగా ప్రాచుర్యం సంపాదించుకున్న వాట్సాప్, కొత్త
కొత్త ఫీచర్లతో అలరిస్తోంది. తాజాగా వాట్సాప్ గ్రూప్ వాయిస్, వీడియో
కాలింగ్ ఫీచర్‌ను కూడా యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రస్తుతం ఈ
ఫీచర్ ఐఫోన్ యాప్ లేటెస్ట్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఇప్పటికే
వాట్సాప్ ఈ ఏడాదిలో పలు ఫీచర్లను ప్రవేశపెట్టి, 1 బిలియన్‌కు పైగా
యూజర్లను తన సొంతం చేసుకుంది. ఇటీవల ఐఫోన్లలో ఉపయోగించే వాట్సాప్
అప్‌డేట్ కోడ్‌లో ఈ విషయానికి సంబంధించి సంకేతాలు ఉన్నట్లు అంతర్జాతీయ
టెక్నికల్ వెబ్‌సైట్లు చెబుతున్నాయి. 2.17.70 ఐఓఎస్ అప్‌డేట్‌లో గ్రూప్
కాల్స్‌కు సంబంధించిన సూచనలు కలిగి ఉందని, ప్రస్తుతం ఇది ధృవీకరణ అయినట్టు
డబ్ల్యూఏబీటాఇన్ఫో ఆదివారం ట్వీట్ చేసింది.
గ్రూప్ వాయిస్ కాల్స్ గురించి చాలా
సంకేతాలున్నప్పటికీ, గ్రూప్ వీడియో కాల్స్‌కు సంబంధించి ఒకే ఒక సంకేతం
ఉన్నట్టు పేర్కొంది. గ్రూప్ వాయిస్ కాల్స్‌కు ఫీచర్‌పై ఈ యాప్ ప్రస్తుతం
పనిచేస్తుందని, వచ్చే ఏడాది దీన్ని విడుదల చేయనున్నట్టు అంతకముందే పలు
రిపోర్టులు నివేదించాయి. గ్రూప్ వీడియో కాలింగ్ గురించి కొద్దిగా సందిగ్ధత
ఉన్నా... గ్రూప్ వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని మాత్రం వాట్సాప్ త్వరలో
తప్పకుండా కల్పించనుందని తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్లు ఎప్పుడు
అందుబాటులోకి వస్తాయనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.