Tuesday, September 22, 2015

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు


రాష్ట్ర శాసనసభ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభంకాగానే.. ఇటీవల మృతిచెందిన మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే పీ కిష్టారెడ్డి మృతికి సభ నివాళులర్పించనుంది. అనంతరం ప్రవేశపెట్టనున్న సంతాప తీర్మానంపై చర్చ జరగనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత సభ వాయిదా పడే అవకాశం ఉంది. అయితే సమావేశాలు ఎన్ని రోజులు, ఏయే తేదీల్లో జరగాలన్న విషయంపై స్పీకర్ మధుసూదనాచారి ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లతో బుధవారం సమావేశం కానున్నారు. ఇందులోనే అసెంబ్లీ సమావేశాల తేదీలపై నిర్ణయం తీసుకోనున్నారు. సభ మొదటిరోజు కావడంతో కిష్టారెడ్డి సంతాప తీర్మానంతోపాటు బీఏసీ సమావేశం మాత్రమే జరగవచ్చని సమాచారం.