అక్కినేని నాగార్జున కుమారులు అఖిల్, నాగచైతన్య త్వరలో ఓ ఇంటివారు
కాబోతున్న సంగతి తెలిసిందే. అక్కినేని అఖిల్.. ఫ్యాషన్ డిజైనర్ శ్రియ భూపాల్‌ని,
అక్కినేని నాగచైతన్య.. సమంతని వివాహం చేసుకోబోతున్నారు. ఇప్పటివరకు
ఈ కాబోయే జంటలు విడివిడిగా దిగిన ఫొటోలే సోషల్‌మీడియాలో కనిపించాయి
కానీ తొలిసారి నలుగురూ కలసి ఒకే ఫొటో దిగారు. సమంత, నాగచైతన్య,
అఖిల్, శ్రియలు కలిసి దిగిన ఫొటోని సమంత ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తూ.. ‘ఫ్యామిలీ’
అని హ్యాష్‌టాగ్ ఇచ్చింది. అఖిల్, శ్రియల వివాహం ఇటలీలో జరగబోతున్నట్లు సమాచారం.
సమంత, నాగచైతన్యలు వచ్చే ఏడాది వివాహం చేసుకోబోతున్నారు.