సాయిధరమ్ తేజ్, రెజీనా జంటగా
నటిస్తున్న పిల్లా నువ్వులేని జీవితం చిత్ర గీతాలు శనివారం రాత్రి
హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ
చిత్రాన్ని బన్నివాసు, శ్రీహర్షిత్ నిర్మిస్తున్నారు. ఎ.ఎస్. రవికుమార్
చౌదరి దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను చిరంజీవి
ఆవిష్కరించారు. తొలి ప్రతిని రామ్‌చరణ్, అల్లు అర్జున్ స్వీకరించారు.
వి.వి.వినాయక్ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ
రామ్‌చరణ్‌తో పాటు సాయిధరమ్‌తేజ్ నాకు మరో బిడ్డ. తను మా ఇంట్లోనే పెరిగాడు. అల్లు అరవింద్, దిల్‌రాజు, బన్నివాసు, హర్షిత్‌ల నిర్మాణంలో ఈ సినిమా రూపొందడం ఆనందంగా వుంది. నా మొదటి సినిమా పునాదిరాళ్లు కంటే ముందు రెండవ సినిమా ప్రాణం ఖరీదు విడుదలైంది. అదే సెంటిమెంట్ ఇప్పుడు సాయిధరమ్‌తేజ్ విషయంలో పునరావృతం అవుతోంది. రామ్‌చరణ్ మగధీర ఎంత పెద్ద సక్సెస్ అయిందో అదే స్థాయి విజయాన్ని ఈ సినిమా సాధిస్తుంది. నేను ఏదైతే ఫాలోఅయ్యానో అదే క్రమశిక్షణను మా కుటుంబంలోని హీరోలంతా అనుసరించడం ఆనందంగా వుంది. ఈ ఇండస్ట్రీకి మరో ప్రకాష్‌రాజ్ లాంటి నటుడిగా జగపతిబాబు ఎదుగుతారు. ఈ కార్యక్రమంలో సాయిధరమ్‌తేజ్, రెజీనా, ఎ.ఎస్.రవికుమార్‌చౌదరి, జగపతిబాబు,అనూప్ రూబెన్స్, బన్నివాసు, హర్షిత్, శిరీష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.