ఐసిసి పదవ ప్రపంచకప్ అనేకమంది క్రీడాకారులకు చివరి ప్రపంచ కప్ కానుంది. వీరు 2015లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌లో సంయుక్తంగా జరగనున్న టోర్నమెంట్‌లో ఆడే అవకాశాలు ఉండకపోవచ్చునని పరిశీలకులు భావిస్తు న్నారు. ఇందులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరు కూడా వినపడుతోంది. రిటైరయ్యే ఆలోచన ఏదీ లేదని సచిన్ పదేపదే చెబుతున్నప్పటికీ అతడు మరో నాలుగు సంవత్సరాలు ఆడకపోవచ్చుననే అభిప్రాయం ఎక్కువమందిలో ఉంది. సచిన్‌తోపాటు జహీర్ ఖాన్ పేరు కూడా ప్రస్తావనకు వస్తుండటం గమనార్హం. ఈ కప్ చివరి కప్ అయ్యే అవకాశాలున్న క్రీడాకారుల్లో ఈ కింది పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
1.స్టీవ్ టికోలో: కెన్యా ఆల్‌రౌండర్‌గా పేరుగాంచిన స్టీవ్ టికోలో తన కెరీర్‌లో ఐదో వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్నాడు. విజయవంతమైన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా పేరుగాంచాడు. 2003 ప్రపంచకప్‌లో కెన్యా సెమీఫైనల్స్‌కు చేరుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.
2.రికీ పాంటింగ్: 36 ఏళ్ల ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ 1990 దశకం నుండి క్రికెట్‌లో కొనసాగుతున్నాడు. వరుసగా మూడు ట్రోఫీలు గెలుచుకున్న ఆసీస్ జట్టులో అతడు సభ్యునిగా ఉన్నాడు. ఈ కప్‌ను ఆసీస్ నిలబెట్టుకుంటే వరుసగా మూడు సార్లు ట్రోఫీ సంపాదించిపెట్టిన కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పుతాడు. పాంటింగ్ స్వయంగా ప్రకటించక పోయినప్పటికీ ఇది అతడి చివరి ప్రపంచ కప్ అని భావిస్తున్నారు.
3. బ్రెట్ లీ: ఆసీస్ స్పీడ్‌స్టర్‌కు ఈ వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశం అనుకోని రీతిలో వచ్చింది. మోకాలి నొప్పితో బాధపడుతున్న తాను ఇంకా ఎంతోకాలం క్రికెట్ ఆడే అవకాశం లేదని బ్రెట్ లీ అనేక సార్లు చెప్పాడు. 2003, 2007లో విజేతగా నిలిచిన ఆసీస్ జట్లలో సభ్యునిగా ఉన్నాడు.
4.పాల్ కాలింగ్‌వుడ్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్. ఇటీవల అంతగా రాణించ లేకపోతుండటంతో అందరూ రిటైర్ కావాలని సూచిస్తున్నారు.
5.స్కాట్ స్టయిరిస్: న్యూజిలాండ్ ఆల్ రౌండర్ తదుపరి ప్రపంచకప్ జరిగే సమయానికి 40వ ప్రాయంలో పడతాడు. వరల్డ్‌కప్‌ల్లో మంచి రికార్డు ఉంది. అతడి సగటు 18 మ్యాచ్‌ల్లో 69.12.
5.షోయబ్ అక్తర్: రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన అక్తర్ ఈ వరల్డ్‌కప్‌పై ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. ప్రపంచంలో ఫాస్టెస్ట్ బౌలర్‌గా పేరుగాంచాడు.
6.జాక్స్ కల్లిస్: దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్. అతడిపైనే ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
7.ముత్తయ్య మురళీధరన్: ఈ వరల్డ్‌కప్ తరువాత వన్డే క్రికెట్‌కు స్వస్తి చెబుతానని ఇంతకుముందే ప్రకటించాడు. టెసÊఉటల్లో 800 వికెట్లు తీసుకున్న మురళి టెస్టు క్రికెట్‌కు ఇంతకుముందే గుడ్‌బై చెప్పాడు.
8.దిల్షన్ తిలకరత్నే: విధ్వంసక ఓపెనర్‌గా పేరుగాంచాడు. శ్రీలంక జట్టులో సీనియర్ బ్యాట్స్‌మన్.
9.శివనారాయణ్ చంద్రపాల్:36 ఏళ్ల చంద్రపాల్ కెరీర్‌లో ఐదో ప్రపంచకప్ ఆడుతున్నాడు.1996 ప్రపంచకప్‌లో విండీస్ రన్నరప్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.
10. జహీర్ ఖాన్: తరచూ గాయాలబారిన పడే జహీర్ ఎక్కువ కాలం క్రికెట్ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. వర్క్‌లోడ్ పెరిగిపోవడమే ఇందుకు కారణం. భారత జట్టు ప్రస్తుతం అతడిపై మితిమీరి ఆధారపడుతోంది.
11. సచిన్ టెండూల్కర్: అన్ని రకాల రికార్డులు, ట్రోఫీలు అందుకున్న సచిన్‌కు వరల్డ్‌కప్ ఒక్కటే వెలితిగా ఉంది. ఈ లోటును ఈసారి నెరవేర్చుకోగలడేమో చూడాలి.