సిసిఎల్ ( సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఆధ్వర్యంలో శనివారం డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి ఏసీఏ- వీడీసీఏ స్టేడియంలో ఆద్వంతం అత్యంత ఆసక్తికరంగా జరిగిన సన్నాహక 20-20 మ్యాచ్‌లో సౌత సూపర్ స్టార్స్ జట్టు 36 పరుగుల తేడాతో బాలీవుడ్ జట్టుపై విజయం సాధించింది. సినీనటుడు మోహన్‌బాబు, రాజ్యసభ్యులు సుబ్బరావి రెడ్డి టాస్ వేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్‌సూపర్ స్టార్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఇందుకు సమాధానంగా బాలీవుడ్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. సౌత్‌సూపర్‌స్టార్స్ బ్యాట్స్‌మెన్ ఆదర్శ 48 పరుగులు చేసి టాప్ స్కోర్‌గా నిలిచాడు. అతని తోడుగా చివరిలో కెప్టెన్ వెంకటేష్ 28 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తారకరత్న 30, కార్తీక్ 10, ద్రువ్ 10, తరుణ్ 4, సంతన్‌భాగ్యరాజ్ 4, శ్యామ్ 0 పరుగులు చేశారు.