ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో
‘ప్రిన్స్’ మహేష్‌బాబు నటించనున్నట్లు
ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి.
మహేష్ అభిమానులు కూడా వీరి
కాంబినేషన్ కోసం ఎంతో ఆసక్తిగా
ఎదురుచూశారు. ఎట్టకేలకు వీరి
కాంబినేషన్‌లో సినిమా చిత్రీకరణ
శరవేగంగా సాగుతూండటంతో అభిమానులు
ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు, తమిళాల్లో దీనిని ఏకకాలంలో
చిత్రీకరిస్తున్నారు. ఇంకా
టైటిల్ ఖరారు చేయలేదు. ప్రస్తుతం
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను
దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నారు.
రెండు భాషల్లో తెరకెక్కుతున్నందున
రెండింటిలోనూ ఒకే శీర్షికను
ఉంచాలన్న ఉద్దేశంతో ఏఆర్ మురుగదాస్
ఆలోచిస్తున్నట్లు సమాచారం.
అంతేకాకుండా ఇటీవలే ఈ సినిమాకు
‘ఏజెంట్ శివ’ అన్న టైటిల్‌ను
పరిశీలించినట్లు తెలుస్తోంది.
ఒకట్రెండు రోజుల్లో దీనికి
సంబంధించిన ప్రకటన వెలువడే
అవకాశం ఉంది. ఇందులో మహేష్‌బాబు
సరసన రకుల్‌ప్రీత్ సింగ్
కథానాయికగా నటిస్తోంది. ఎస్‌జే
సూర్య విలన్‌గా నటిస్తున్నారు.
హ్యారీస్ జయరాజ్ సంగీతం సమకూరుస్తున్నారు.
సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్‌గా
వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే
అనువాద చిత్రాల ద్వారా చెన్నై,
కాంచీపురం, తాంబరం వంటి ప్రాంతాల్లో
అభిమాన గణాన్ని మహేష్‌బాబు
సొంతం చేసుకున్నారు. ఇప్పుడు
ఏకంగా నేరుగా చిత్రంతో ప్రేక్షకజనాన్ని
ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు.