తమిళంలో హన్సిక జోరు
కొనసాగుతోంది. కథానాయికగా ఎనిమిది చిత్రాల్లో నటిస్తూ తీరిక లేకుండా
గడుపుతోంది. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో చిత్రాన్ని అంగీకరిస్తూ ఇతర
హీరోయిన్‌లకు గట్టిపోటీని ఇస్తోంది. తమిళ చిత్రాలపై మాత్రమే
దృష్టిసారిస్తున్న ఈ సుందరి తెలుగు భాషా చిత్రాలను పూర్తిగా తగ్గించింది.
ఆమె దూకుడు చూస్తుంటే హన్సిక పూర్తి స్థాయిలో తమిళ చిత్రాలకే అంకితమై
పోయిందని అంటున్నారు. ఇదే విషయాన్ని హన్సికను అడిగితే... తెలుగు
ప్రేక్షకులకు ఎప్పటికీ దూరంకానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ తెలుగు, తమిళ
భాషలు నాకు రెండు కళ్లలాంటివి.
Saturday, October 25, 2014
ఈ సారి100కోట్ల హీరో ఎవరు?
చరణ్, బన్ని, మహేష్, ఎన్టీఆర్, రవితేజ, ప్రభాస్ .. వీళ్లంతా 50కోట్ల క్లబ్ హీరోలు. ఈ ఆరుగురిలో అరడుగుల బుల్లెట్టు పవన్ రికార్డుని అధిగమించే సత్తా ఎవరికి ఉంది? ఉన్నఫళాన ఎవరికైనా 100కోట్ల వసూళ్లు సాధించే సీనుందా? అంటే ఒకే ఒక్కరికి సాధ్యం అని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆ ఒక్కరు ఎవరు? అనేదే ఈ కథాకమామీషు ...
టాలీవుడ్‌లో ఇప్పటివరకూ 100కోట్ల వసూళ్లు సాధించిన ఏకైక చిత్రం `అత్తారింటికి దారేది' పేరు వినిపిస్తోంది. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ మాత్రమే ఇలాంటి ట్రెండ్‌ని సెట్ చేయగలను అని నిరూపించాడు. మరి ఆ తర్వాత ఆ రికార్డును కొట్టే మొనగాడే టాలీవుడ్‌లో లేడా? అంటే ఉన్నాడనే డిస్కషన్‌స సాగుతున్నాయి. చరణ్, బన్ని, మహేష్, ఎన్టీఆర్, రవితేజ, ప్రభాస్ ఈ ఆరుగురిలో ఒక్కరికే ఆ ఛాన్సుందనేది నిజం. అయితే లేటెస్టు గణాంకాల ప్రకారం ఎన్టీఆర్, మహేష్ ట్రాక్ రికార్డు ఏమంత బాలేదు. ఈ ఇద్దరూ వరుస ప్లాప్‌లతో రేసులో పూర్తిగా వెనుకబడ్డారు. అందువల్ల ఒక్కసారే అంత పికప్ సాధ్యపడదు. వంద కోట్లు అని రాసేసినంత సులువు కాదు వసూళ్లు రాబట్టడం. రికార్డులు తిరగరాయడం. కచ్ఛితంగా సినిమాలో స్టామినాతో పాటు, హీరో, దర్శకుడు కాంబినేషన్‌లోనూ ఆ రేంజు ఉండాలి. అలాగే చరణ్ ఇప్పటికే మగధీర సినిమాతో దాదాపు 88కోట్ల వసూళ్లు సాధించాడు. 100కోట్లకు చేరువలోనే ఉన్నా చరణ్‌కి ఆ స్థాయి సినిమాని ఇచ్చే దర్శకుడు టాలీవుడ్‌లో వేరెవరూ కనిపించడం లేదు. మళ్లీ రాజమౌళితో సినిమా చేస్తేనే ఆ స్థాయి వస్తుందేమో! అలాగే బన్నీ రేసుగుర్రం సినిమాతో దాదాపు రూ.65కోట్ల వసూళ్లు సాధించాడు. అతడికి ఇదే `జులాయి' తర్వాత 50కోట్ల వసూళ్లు దాటించిన సినిమా. బన్నీకి కూడా సరైన దర్శకుడు పడితే 100కోట్లు సాధ్యమే. కానీ అది అంత ఈజీ కానేకాదు. మాస్‌రాజా రావితేజ కొట్టాలంటే మ్యాజిక్ చేసే కథాంశం కావాల్సిందే. మరి యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ కొట్టేస్తాడా? కచ్ఛితంగా .. ఆ ఛాన్‌స కనిపిస్తోంది. టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న `బాహుబలి' చిత్రంతో 100కోట్లు బెంచ్‌మార్‌కను ప్రభాస్ సునాయాసంగా అధిగమిస్తాడు. ఈ సినిమా భారీ కాన్వాసుతో 300 రేంజులో తెరకెక్కుతోంది.
సౌత్‌లోనే `ఐ' చిత్రం తర్వాత దాదాపు 150కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇది. అలాగే శంకర్ తర్వాత దక్షిణాదిన ఆ స్థాయి ఉన్న దర్శకుడిగా రాజమౌళికి గుర్తింపు ఉంది. మగధీర, ఈగ సినిమాలతో ప్రపంచస్థాయి సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా అంతర్జాతీయ ఖ్యాతి దక్కించుకున్న రాజమౌళి ఈసారి అంతకంటే పకడ్భందీ స్క్రిప్టుతో యూనివర్శల్ అప్పీల్‌తో ఉన్న సినిమాతో ముందుకొచ్చాడు. బాహుబలి చిత్రాన్ని ఇటు దేశభాషల్లో, అటు విదేశీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పటికే ఒక్క తెలుగులోనే దాదాపు రూ.40కోట్లు ముందస్తు అమ్మకాల రూపంలో సంపాదించేశారు. ఏ కోణంలో చూసినా 100కోట్లు చాలా సులువుగా ఈ సినిమా ఆర్జిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇక్కడో ట్విస్టేమిటంటే బాహుబలి రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ రెండు భాగాలు ఒక్కోటి 100కోట్ల వసూళ్లు సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ రకంగా ప్రభాస్ ఒక్కడే ఇప్పటికి పవన్ రికార్డును కొట్టేసే ఛాన్సుందన్నమాట!
Subscribe to:
Posts (Atom)