మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై
చెప్పారు. కొంతకాలంగా సచిన్ రిటైర్మెంట్‌పై చర్చ జరుగుతున్న విషయం
తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వన్డేలకు గుడ్‌బై చెప్పడం కూడా చర్చనీయాంశమైంది.
వన్డేలకు గుడ్‌బై చెప్పినప్పటికీ, టెస్టుల్లో కొనసాగుతానని ఆయన తెలిపారు.
టీమిండియా కెప్టెన్‌గా సచిన్ వ్యవహరించారు. సచిన్ 463 వన్డేల్లో 18,426
పరుగులు చేశారు. పాక్ సిరీస్‌కు ముందుగానే ఆయన వన్డేలకు ఆడనని
రిటైర్మెంట్ చేయడం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. వన్డేల్లో 49
సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు చేశాడు. వన్డేల్లో సచిన్ అత్యధిక స్కోరు 200
నాటౌట్‌గా ఉన్నాడు. వన్డేల్లో 154 వికెట్లు తీశాడు. వన్డేల్లో సచిన్
బ్యాటింగ్ సగటు 44.86గా ఉంది. సచిన్ తన కెరీర్‌లో తొలి, చివరి వన్డేలను
పాకిస్థాన్‌పైనే ఆడారు. 23 ఏళ్ల వన్డే క్రికెట్‌కు ఆయన గుడ్‌బై చెప్పారు.
వన్డేలకు సచిన్ గుడ్‌బై చెప్పిన మాట నిజమేనంటూ బీసీసీ సచిన్
రిటైర్మెంట్‌ను ధృవీకరించింది. వరల్డ్ కప్ గెలిచిన టీంలో ఉండడం తన
అదృష్టమని సచిన్ చెప్పారు. వన్డేలకు గుడ్‌బై చెప్పిన మాట వాస్తమేనని ఆయన
స్పష్టం చేశారు. టెస్టుల్లో కొనసాగుతానని సచిన్ ప్రకటించారు. తనకు అండగా
నిలిచిన సహచరులు, బీసీసీఐ సభ్యులు, క్రికెట్ అభిమానులకు ఆయన కృతజ్ఞతలు
తెలిపారు. వన్డేలకు గుడ్‌బై చెబుతూ సచిన్ తీసుకున్న నిర్ణయం తనను
ఆశ్చర్యానికి గురి చేసిందని మాజీ క్రికెటర్ శ్రీకాంత్ తెలిపారు.
వన్డేల్లో ఎంతో ప్రతిభకనబర్చిన సచిన్ అందరికీ ఆదర్శప్రాయులని ఆయన
కొనియాడారు.
అందరికీ కృతజ్ఞతలు : సచిన్
క్రికెట్‌లో ఇన్నేళ్లు తనను ప్రోత్సహించిన వారందరికీ సచిన్ కృతజ్ఞతలు తెలిపారు. రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం సచిన్ మీడియాతో మాట్లాడారు. టీమిండియా భవిష్యత్ ఉత్తమంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 2015 ప్రపంచకప్‌కు ఇప్పటి నుంచే సన్నాహక ప్రక్రియ ప్రారంభించాలని టీంకు సూచించారు.
అందరికీ కృతజ్ఞతలు : సచిన్
క్రికెట్‌లో ఇన్నేళ్లు తనను ప్రోత్సహించిన వారందరికీ సచిన్ కృతజ్ఞతలు తెలిపారు. రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం సచిన్ మీడియాతో మాట్లాడారు. టీమిండియా భవిష్యత్ ఉత్తమంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 2015 ప్రపంచకప్‌కు ఇప్పటి నుంచే సన్నాహక ప్రక్రియ ప్రారంభించాలని టీంకు సూచించారు.