ప్రేమపక్షులుగా చాలా కాలంగా ప్రచారంలో ఉన్న బాలీవుడ్ నటి అనుష్కాశర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు కలిసి.. బహిరంగంగా ఒక చోట కనిపించారు. పుణెలో ఆదివారం జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ ఆటను చూసేందుకు వీళ్లిద్దరూ కలిసి వచ్చారు.ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ జట్లలో విరాట్ కోహ్లీ ఎఫ్‌సీ గోవా ఫ్రాంచైజీకి సహ యజమాని.తన జట్టు ఓటమి అంచుల్లో ఉండటంతో కోహ్లీ చాలా ఆందోళనగా కనిపించగా.. తన ప్రేమికుడి ఆందోళనను అనుష్క కూడా పంచుకుంది. ఇక విరాట్ జట్టును ఓడించిన ఎఫ్‌సీ పుణె జట్టు సహ యజమాని „హృతిక్ రోషన్ కూడా మరికొందరు నటులతో కలిసి ఈ ఆట చూసేందుకు వచ్చాడు. అర్జున్ కపూర్, ఈషాగుప్తాలతో కలిసి ఈ మ్యాచ్‌ని బాగా ఎంజాయ్ చేస్తూ „హృతిక్ కనిపించాడు.