దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రథమ వర్థంతి సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఆయనకు నివాళులు అర్పించారు. హీరో శ్రీహరి, బైరవ చిత్ర నిర్మాత నట్టికుమార్‌లు పేద కళాకారులకు చీరలు పంపీణీ చేశారు.ఆ కార్యక్రమాలలో హీరో రాజశేఖర్, జీవిత పాల్గొన్నారు. వై. ఎస్ మృతి పట్ల రాష్ట్రానికి తీరని లోటని శ్రీహరి అన్నారు.
Thursday, September 2, 2010
వై.ఎస్.కు సినీ పరిశ్రమ నివాళి
వైఎస్‌తో ఉన్న ఆత్మీయత గొప్పంది : రోశయ్య
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న అనుబంధం, ఆత్మీయత చాలా గొప్పదని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. వైఎస్ ప్రధమ వర్థంతి కార్యక్రమాలకు వెళ్లాలని ఉన్నా ఆరోగ్య కారణాల వల్ల వెళ్లలేకపోతున్నానని ఆవేధన వ్యక్తం చేశారు. ఆయన చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలు ప్రజల్లో ఎప్పుడూ పచ్చగానే ఉంటాయన్నారు. వైఎస్ మరణం ఊహించలేనిదని రోశయ్య అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నాడు. ఆయన ప్రతి నిమిషం ప్రజల ఆవేధన గురించి మాట్లాడుతు ఉండేవారు. ఎవరొచ్చి అడిగినా లేదనటం ఆయనకు చేతకాదని ముఖ్యమంత్రి రోశయ్య గుర్తు చేసుకున్నారు.
Subscribe to:
Posts (Atom)