Wednesday, May 18, 2016

ఆ విషయంలో చాలా హర్ట్‌ అయ్యా!

 పవన్‌కల్యాణ్‌ గురించి తానేమీ మాట్లాడనని స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మరోసారి స్పష్టం చేశారు.నాగబాబు కుమార్తె నిహారిక, నాగశౌర్య జంటగా నటించిన ‘ఒక మనసు’ ఆడియో ఫంక్షన్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు పవన్‌.. పవన్‌.. అంటూ కేకలు వేశారు. దీంతో ఆయన కాస్త అసహనానికి గురయ్యారు. ‘‘మీరంతా ఎంతగా అరిచినా పవన్‌కల్యాణ్‌ గురించి నేను మాట్లాడను... మాట్లాడలేను. ఆయన మీద ఉన్న ఇష్టాన్ని గతంలో ఎన్నోసార్లు చెప్పాను. ఇంకా కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సినీరంగంలో చిరంజీవి తర్వాత నన్ను సపోర్ట్‌ చేసింది పవన్‌కల్యాణే’’ అన్నారు.
ఫ్యామిలీకి సంబంధించిన ఈ అంశంపై ఏం మాట్లాడినా అపార్థాలే వస్తున్నాయని... అభిమానులు కేకలు వేస్తూ.. తనను వంద రెట్లు హర్ట్‌ చేశారన్నారు. సోషల్‌ మీడియాలో వస్తోన్న అనేక కామెంట్లు తనను చాలా బాధించాయని ఆవేదనగా చెప్పారు. అలాంటి కామెంట్లు చేయొద్దని పవన్‌ను, తనను ఇష్టపడే అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాంటి కామెంట్లతో తమ కుటుంబానికి ఇబ్బంది వస్తుందని.. తన మూలంగా అందరికీ మచ్చరావడం ఇష్టం లేదన్నారు. అభిమానులంతా మంచి ప్రవర్తనతో మెలుగుతూ తనను అర్థం చేసుకుంటారని అల్లు అర్జున్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

అనుష్కకు వెల్‌కమ్.. నయనకు నో..!



టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలను హీరోయిన్ ల కొరత తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. నాగ్ లాంటి స్టార్లు ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకుంటుంటే కమర్షియల్ సినిమాలు చేస్తున్న హీరోలు మాత్రం తమ వయసుకు తగ్గ జోడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నయనతార, అనుష్క లాంటి ఒకరిద్దరు మాత్రం సీనియర్ హీరోలకు సూట్ అవుతుండటంతో వారి మధ్య తీవ్రమైన పోటి నెలకొంది. అనుష్క బాహుబలి సినిమాలతో బిజీగా ఉండటంతో ఇన్నాళ్లు సీనియర్ హీరోల సినిమాలు నయనతార చేతికి వెళుతున్నట్టుగా కనిపించాయి.
బాహుబలి షూటింగ్ చివరి దశకు రావటంతో సౌత్ ఇండస్ట్రీలో సీన్ మారుతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి 150వ సినిమాలో ముందు నుంచి నయనతార హీరోయిన్ అంటూ ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని అనుష్క పేరును పరిశీలిస్తున్నారట. బాబు బంగారం షూటింగ్ విషయంలో నయన్ సరిగ్గా డేట్స్ ఇవ్వక పోవటం కూడా ఈ మార్పుకు కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బాహుబలితో పాటు సింగం 3, తలా 57 సినిమాల్లో నటిస్తున్న అనుష్క, చిరు సినిమాకు డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తుందో చూడాలి.

‘బ్రహ్మోత్సవం’ పిక్నిక్‌ మీరూ చూడండి!

 మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలోని బ్రహ్మోత్సవం... అనే పాట మేకింగ్‌ వీడియో విడుదలైంది. ఓ పెద్ద కుటుంబం పిక్నిక్‌కు వెళ్లి... అక్కడ సంతోషంగా గడిపే సన్నివేశాలను ఈ వీడియోలో చూపించారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రసాద్‌ వి. పొట్లూరి, మహేశ్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. మిక్కీ జె. మేయర్‌, మణిశర్మ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ శుక్రవారం ‘బ్రహ్మోత్సవం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత, కాజల్‌, ప్రణీత చిత్రంలో కథానాయికలుగా నటించారు. రేవతి, జయసుధ, నరేష్‌, సత్యరాజ్‌, శుభలేఖ సుధాకర్‌, రావు రమేష్‌, తనికెళ్ల భరణి తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.

రాయ్‌లక్ష్మి కొత్త బాయ్‌ఫ్రెండ్‌ని చూడండి!


కాంచనమాల కేబుల్‌టీవీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి రాయ్‌ లక్ష్మి. అధినాయకుడు, కాంచన తదితర చిత్రాల్లో నటించిన ఈ భామ ప్రత్యేక గీతాలతో సైతం అభిమానులను అలరిస్తోంది. తాజాగా ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’లో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌తో చిందేస్తూ ఓ ప్రత్యేక గీతంలో కనిపించిన రాయ్‌ లక్ష్మి బుధవారం ట్విట్టర్‌ ఖాతాలో తన పెంపుడు కుక్కపిల్లతో కలిసి దిగిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ‘నా కొత్త బాయ్‌ఫ్రెండ్‌.. మఫిన్‌(కుక్కపిల్ల పేరు)ను చూడండి, ఎంత బాగున్నాడో కదా’ అని ట్వీట్‌ చేశారు.