లంక క్రికెటర్లు మహేలా జయవర్థనే, సమరవీరపై ఒక టివి ఛానల్ చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు నిరాధారమైననవి, ఆ ఛానల్ ప్రచారం చేసిన కథానాల్లో వాస్తవం లేదని శ్రీలంక క్రికెట్ ఆసోసియేషన్ పేర్కొంది. ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్- ఎలో పాకిస్థాన్, లంక మధ్య ఫిబ్రవరి 26న కొలంబోలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో లంక 11 పరుగుల తేడాతో ఓడిపాయిన సంగతి తెలిసిందే. 277 పరుగుల లక్ష్య చేదనలో లంక ఇన్నింగ్స్ 266/9 వద్ద ముగిసింది. లంక బ్యాట్స్‌మెన్ మహేల జయవర్థనే, తిలాన్ సమరవీరలు ఉద్వేశపూర్వ కంగానే ఔటయ్యారని లంక అధికారిక టీవీ ఛానెల్ ఆరోపించింది. లంక మ్యాచద్ ఓడిపోతుందని 18 వేల డాలర్లు పందెం కాశాడని, దీనికి తగ్గట్టుగానే జయవర్థనే 2 పరుగులకు ఔట్ కాగానే ఇండిపెండెంట్ టెలివిజన్ నెట్‌వర్క్ ( ఐటీఎస్) ఛానెల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల్ని శ్రీలంక క్రికెట్ బోర్డు ఖండించింది.
ఆస్ట్రేలియా, జింబాబ్వే
జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో వాట్సన్, హాడిన్ తొలి 10 ఓవర్లలో ఆసీస్ ఓపెనర్లు షేన్ వాట్సన్, బ్రాడ్ హాడిన్ ఆడిన తీరుపై సందేహాలు నెలకొన్నాయి. ఇద్దరు ఓపెనర్లు కలిసి 11 ఓవర్లలో కేవలం 28 పరుగుల మాత్రమే చేశారు. 15 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 53 మాత్రమే. ఓపెనర్లు నెమ్మదిగా ఆడడంపై సందేహాలు తలెత్తడంతో ఐసీసీ అవినీతి నిరోధక విభాగం మ్యాచ్‌ను సమీక్షించినట్లు తెలుస్తోంది.