Saturday, December 4, 2010

మూడు వన్డేలో భారత్‌ ఘన విజయం


కెప్టెన్‌ గంభీర్‌ 126 ( 117) సెంచరీ, విరాట్‌ కోహ్లీ 63 (70) అర్థసెంచరీలతో చెలరేగడంతో మూడో వన్డేలో భారత్‌ 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. దీంతో భారత్‌ 3-0 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. మరికొద్ది రోచేసుకుంది. మరికొద్ది రోజుల్లో ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో ఈ విజయం టీం ఇండియాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఓపెనర్‌ విజరు 30( 50)తో గౌతమ్‌ గంభీర్‌లు మొదటి వికెట్‌కు 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం భారత్‌ను పటిష్ఠ స్థితిలో ఉంచింది.

అంతకు ముందుటాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ నిర్థీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. గుప్తిల్‌ 12, మెక్‌కలమ్‌ 0, విలియమ్‌సన్‌ 21, టేలర్‌ 4, స్లైరిస్‌ 22, వెట్లోరి 3, హాప్కిన్స్‌ 6, మెక్‌కలమ్‌ 43, మిల్స్‌ 15 పరుగులు చేసి ఔటయ్యారు. ఫ్రాంక్లిన్‌ 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత్‌ బౌలర్లలలో జహీర్‌ , అశ్విన్‌,పఠాన్‌ రెండేసి వికెట్లు తీయగా, మునాఫ్‌ పటేల్‌కు ఓ వికెట్‌ దక్కింది.