గ్రామానికి ప్రపంచవ్యాప్త గుర్తింపుతెచ్చిన యువకుడు
పుట్టిన ఊరుకు ఎదో చేయాలనే తపన. ప్రభుత్వ ఉద్యోగం లేకపోయినా స్వయం కృషితో చిన్నషాపు నడుపుకుంటూ కుటుంబా న్ని వెల్లదీస్తున్న ఓ యువకుడు. గ్రామం కోసం రూ.20 వేల వరకు ఖర్చుపెట్టి ఏకంగా ఒక వెబ్‌సైట్‌ను కొనుగోలు చేశాడు. అందులో గ్రామచరిత్రను పెట్టాడు. ఇప్పుడు ఆ గ్రామం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. స్వార్థంతో ఆలోచించే ఈ రోజుల్లో తన సంపాద లోంచి ఖర్చు చేయడం పట్ల పలువురు అభినం దిస్తున్నారు. అతనే కొల్చారం మండలం చిన్నఘనపూర్ గ్రామానికి చెందిన శ్రీను. చిన్నఘనపూర్ ఈ పేరు ఇప్పుడు నెట్‌లో హల్ చల్ చేస్తోంది. కొల్చారం మండలంలోని ఈ గ్రామానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. వందేం డ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన, జిల్లాలో ఏకైక మధ్యతరహా, సాగునీటి ప్రాజెక్టు అయిన ఘన పూర్ ఆనకట్ట ఈ గ్రామ పరిధిలోనే ఉండ టం విశేషం. దీనిద్వారా సాగునీటి రంగంలో గ్రామానికి రాష్ట్ర వ్యాప్త గుర్తింపు ఉంది. ప్రస్తుతం మరో ప్రత్యేకతను సంతరించుకుని ఊరి పేరు ప్రపంచ వ్యాప్తమైంది.