భారత బ్యాట్స్‌మన్ గౌతమ్ గంభీర్ కొత్త ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పి నేడు వైవాహిక జీవితంలోకి ఆడుగుపెట్టబోతున్నాడు. ఢిల్లీకే చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె నటాషా జైన్‌తో గంభీర్‌కు గుర్గావ్ ఫామ్ హౌస్‌లో శుక్రవారం వివాహం జరగనుంది. ఈ ప్రయివేట్ కార్యక్రమానికి గంభీర్ సన్నిహిత స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నారు. ఈ వివాహానికి ప్రముఖ సింగర్ రహత్ ఫతేష్ ఖాన్ ప్రత్యేక ఆహ్వానితునిగా విచ్చేయనున్నాడు. గౌతమ్, నటాషాలకు సంవత్సరం క్రితం పరిచయం ఏర్పడింది. ఆరు నెలల కిందే వీరి వివాహాం జరగాల్సింది. కానీ భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్ నేపథ్యంలో వాయిదా పడింది.