శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. తన రిటైర్‌మెంట్ విషయాన్ని మలింగ మీడియాకు తెలిపాడు. ప్రస్తుతానికి ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు తరుపున ఆడుతున్న మలింగ ఇంగ్లాండ్‌లో జరిగే పర్యటనకు శ్రీలంక సెలక్షన్ కమిటీ జట్టునుంచి తప్పించారు. శ్రీలంకలో జరిగే అన్ని వన్డేలకు, టీ 20 మ్యాచ్‌లకూ తాను అందుబాటులో ఉంటానని అన్నాడు. తన ఫిట్‌నెస్ బాగానే ఉందని అయితే మోకాలి సమస్యలను మాత్రం మేనేజ్ చేయాల్సి ఉందని లాంగ్ సీరీస్ ఆడితే సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.