‘2002లో బాలాదిత్య నటించిన ‘చంటిగాడు’ చిత్రంతో నిర్మాతగా నా ప్రస్థానం మొదలై ఈ ఏడాదితో పదేళ్లయ్యింది’ అన్నారు. నిర్మాత బి.ఎ. రాజు. ఆయన పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ నిర్మాతగా నా ప్రస్థానం మొదలై ఈ ఏడాదితో పదేళ్లు కావడం ఆనందంగా వుంది. ప్రస్తుతం ‘ప్రేమకావాలి’ ఫేమ్ ఆది కథానాయకుడిగా డా. రాజేంవూదవూపసాద్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘లవ్‌లీ’ చిత్రాన్ని ఆర్. ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్నాను. బి. జయ దర్శకురాలు. శాన్వి నాయికగా నటిస్తోంది. నాలుగు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. జనవరి 2 నుంచి డబ్బింగ్ ప్రారంభించాం. ఓ పాటను ఈ నెల 8నుంచి కేరళలోని చాలకుడిలో సబీనా ఖాన్ నేతృత్వంలో చిత్రీకరించనున్నాం. మరో మూడు పాటలను విదేశాల్లో చిత్రీకరించి ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు.