గౌతమితో
విడిపోవడం విషయంపై ఇప్పట్లో తానేం చెప్పబోనని నటుడు కమల్ హాసన్
ప్రకటించారు. గౌతమి ప్రకటనపై కమల్ స్పందించి ప్రకటన విడుదల చేశారని
వార్తలు వచ్చాయి. అయితే తాను ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదని కమల్‌హాసన్
తన ట్విట్టర్ ఖాతా ద్వారా తాజాగా స్పష్టం చేశారు. ‘ఇలాంటి సమయంలో.. కొందరు
నా పేరుతో నకిలీ ప్రకటనను ప్రచారం చేస్తున్నారు. అది అనాగరిక చర్య,
అసంబద్ధమైనది. ఇప్పట్లో నేను ఏ ప్రకటనను జారీ చేయడం లేదు’ అని కమల్‌హాసన్
తమిళంలో ట్వీట్ చేశారు.
విడిపోవడానికి కారణం అదేనా?
కమల్‌హాసన్, నటి గౌతమి తమ 13 ఏళ్లసహజీవన బంధానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. కమల్‌హాసన్‌తో విడిపోతున్నట్లు మంగళవారం సోషల్‌మీడియా ద్వారా చెప్పిన గౌతమి అందుకు కారణం చెప్పలేదు. అయితే ఇటీవల ‘శభాష్‌నాయుడు’ చిత్రం షూటింగ్ సమయంలో కమల్‌హాసన్ కుమార్తె శ్రుతిహాసన్, గౌతమిల మధ్య విబేధాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా శ్రుతిహాసన్ వస్త్రధారణ తదితర విషయాల్లో గౌతమి కల్పించుకోవడం ఆమెకు నచ్చలేదని, ఈ విషయంలో కమల్ తన కుమార్తె వైపు నిలిచారని సమాచారం. కమల్, గౌతమి విడిపోవడానికి ఇదో కారణం అని కొన్ని పత్రికలు రాశాయి. అయితే అలాంటిదేం లేదని శ్రుతి అధికార ప్రతినిధి తాజాగా ప్రకటించారు. ఆమె ఇతరుల వ్యక్తిగతవిషయాల్లో జోక్యం చేసుకోరని స్పష్టంచేశారు.
అయితే మరో కారణం కూడా వీరిద్దరు వేరుకావడానికి దారితీసిందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. కమల్‌హాసన్ కాలికి కొన్నాళ్ల క్రితం ప్రమాదవశాత్తు గాయమైంది. ఈ విషయాన్ని కమల్‌హాసన్ కుమార్తెలు శ్రుతిహాసన్, అక్షరా హాసన్‌లకు గౌతమి వెంటనే తెలియజేయలేదట. దీంతో ఇద్దరు కుమార్తెలకు, గౌతమికి మధ్య మాటామాటా పెరిగిందని, ఆ సంఘటనే గౌతమి నిర్ణయానికి కారణమని వార్తలు వస్తున్నాయి.