భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 482 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీపాటింగ్ టెస్టులో 40వ సెంచరీ పూర్తి చేశాడు. కెప్టెన్ క్లార్క్ కెరీయర్‌లో తొలి డబుల్ సెంచరీ చేశాడు. భారత్‌పై ఆస్ట్రేలియా 291 పరుగుల అధిక్యంలో ఉంది. రెండో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు ఇబ్బంది లేకుండా అడారు. రికీపాటింగ్ 134 పరుగుల చేసి ఇషాంత్ బౌలింగ్‌లో సచిన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆట ముగిసే సమయానికి క్లార్క్ 251, హాస్సీ 55 పరుగులతో నాటౌట్‌గా మిగిలారు. టీమిండియా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లును ఇబ్బంది పెట్టలేకుండా పోతున్నారు.