భారత్ ఇప్పటి వరకు సౌతాఫ్రికాలో ఒక్క వన్డే సిరీస్ కూడా సొంతం చేసుకోలేపోయింది. ఈ సారి మాత్రం సిరీస్ సొంతం చేసుకోవాలని ధోని సేన ఉవ్విళ్లూరుతున్నది. వచ్చిన అవకాశాని మాత్రం వద్దులుకోవద్దు అని నిర్ణయం తీసుకుంది. ఐదు వన్డే సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ముందంజలో వుంది. ఇంకా రెండు వన్డే మాత్రమే మిగిలివున్నవి. రేపు జరిగే నాల్గొవ వన్డే మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సోంతం తహతహ లాడుతున్నది. మూడో వన్డే యూసుఫ్ పఠాన్, హర్బజన్ సింగ్, ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 110 పరుగులు చేశారు. బౌలింగ్ విధానంలో జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్ ఇద్దరు రాణిస్తున్నారు. ప్రదాన లోపం ఓపెనరు సహాయంతో భారీ స్కోరు అందించడంలో విఫలమవుతున్నారు. ఈ సారి మాత్రం రైనా, యువరాజ్‌సింగ్, కోహ్లీ రెచ్చిపోయి ఆడితే విజయం భారత్‌దే.
Thursday, January 20, 2011
ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీకి గుడ్‌బై
టెస్టుల్లో నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు న్యూజిలండ్ కెప్టెన్ డానియెల్ వెటోరి స్పష్టం చేశాడు. పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 0-1 తేడాతో కోల్పోయిన తర్వాత నిరాశ చెందిన ఈ స్పిన్నర్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. వరల్డ్‌కప్ తర్వాత వన్డే బాధ్యతల నుంచి కూడా వైదొలుగుతానని చెప్పాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా. ఆట నుంచి మాత్రం ఇప్పుడే వీడ్కోలు తీసుకోబోనని వెటోరి తెలిపాడు.
టెస్టు సిరీస్ పాకిస్థాన్ వంశం
న్యూజలాండ్ , పాకిస్థాన్ మధ్య జరుగుతన్న రెండు టెస్టుల సిరీస్‌లో పాక్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఐదేళ్ల తర్వాత పాకిస్థాన్ టెస్టు సిరీస్ గెలిచింది. చివరిసారిగా 2006లో వెస్డిండీస్‌తో సిరీస్ నెగ్గిన తర్వాత పాక్‌కు ఇదే తొలి విజయం. బుధవారం చివరి రోజు 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ఆటముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసేందుకు అవకాశమున్నా పాక్ బ్యాట్స్‌మెన్ అనవసర రిస్క్ తీసుకోలేకపోయారు. మ్యాన్ ఆప్ ది మ్యాచ్ కెప్టెన్ మిస్బావుల్ హక్ ఎంపికయ్యాడు.
Subscribe to:
Posts (Atom)