Monday, December 12, 2016

ఏ హీరోతో అంత సరదాగా లేను: కాజల్

 మెగాస్టార్ చిరంజీవి అందం నాలుగురెట్లు పెరిగిందంటోంది అందాలభామ కాజల్ అగర్వాల్. ఖైదీ నంబర్ 150 చిత్రంలో చిరంజీవితో జతకట్టిన అమ్మడు మెగా స్టార్ పై పొగడ్తల వర్షం కురిపించింది. 'మెగా ఇమేజ్ ను కూడా పక్కన పెట్టి సెట్లో అందరితో సరదాగా ఉండే వారు.నేను సెట్ లో కంఫర్టబుల్ గా మూవ్ అయ్యేలా అవకాశం ఇచ్చారు. నేను నటించిన చిత్రాల్లోని ఏ ఇతర హీరోతో కూడా అంత సరదాగా గడపలేదు. సెట్లో ఉన్న వారందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. షూటింగ్ సమయంలో ఆయనతో సరదాగా జోకులు కూడా వేశాను. తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి నిజంగా ఓ గొప్ప డ్యాన్సర్' అంటూ  కాజల్ తెగ సంబరపడుతోంది.

'డ్యాన్స్ చేసే సమయంలో కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. వాటి ద్వారా నా డ్యాన్స్ లో మార్పు కూడా వచ్చింది. ఆ మార్పును సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరే చూడొచ్చు. ఇంత కాలం చిరు సినిమా కోసం ఎదురు చూసిన అభిమానులను ఈ చిత్రం తప్పకుండా అలరిస్తుంది. మెగాస్టార్ తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నా.  అయనతో కలిసి పని చేయడం నాకు ఎంతో ప్రత్యేకం' అంటూ  కాజల్ మురిసిపోయింది.

సురేఖ సమర్పణలో వీవీ వినాయక్ దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.తమిళంలో ఘన విజయం సాధించిన కత్తి చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం 2017 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

మహేష్ సినిమాలో గోల్డెన్ చాన్స్


మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం వచ్చిందంటే ఎగిరి గంతేస్తాం. అలాంటిది తెలుగులోను, తమిళంలోను ఒకేసారి తీస్తున్న సినిమాలో అవకాశం వస్తే.. మరింత అద్భుతంగా ఉంటుంది కదూ. సరిగ్గా అలాంటి అవకాశమే భరత్‌కు వచ్చింది. సినిమాలో ఒక కీలక పాత్రకు భరత్‌ను తీసుకున్నామని, అతడి పాత్ర ఏంటన్నది సినిమా విడుదలయ్యే వరకు బయటకు రానివ్వబోమని సినిమా వర్గాలు తెలిపాయి. సినిమా కథ దృష్ట్యా ఇది చాలా ముఖ్యమైనది కావడం వల్లే ఇలా చేస్తున్నామన్నారు. 
 
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో షూటింగ్ జరుపుకొంటోంది. సినిమా టైటిల్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదని, 'సంభవామి' అనే టైటిల్ ఒకటి పరిశీలనలో ఉందని సినిమా వర్గాలు చెప్పాయి. వచ్చే సంవత్సరం జనవరిలో టైటిల్‌ ఏంటన్నది ఫిక్స్ చేస్తామన్నారు. ఇప్పటికి తమ చేతిలో నాలుగు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయన్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమాలో ఇంకా ఎస్‌జే సూర్య, ఆర్‌జే బాలాజీ, ప్రియదర్శి పులికొండ ఉన్నారు. హ్యారిస్ జజరాజ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.