' సింగం' చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయాలని రోహిత్ శెట్టి నిర్ణయించుకోగానే ముందుగా కథానాయిక పాత్ర కోసం అనుష్కా శెట్టిని సంప్రదించాడు. ' సింగం' సినిమాలో ఒరిజినల్‌లో తన గ్లామర్‌తో ఆకట్టుకున్న అనుష్క బాలీవుడ్‌లో అదరగొడుతుందని అతను ఆశించాడు. కానీ అనుష్క మాత్రం ఆ చిత్రంలో నటించడానికి అనుష్క ససేమీరా అనేసింది. ఆ సినిమాలో ఎందుకు వదులుకున్నందో అర్థం కాలేదు. అజరు ఎంత పెద్ద స్టార్ అనేది అనుష్క అంచనా వేయలేకపోయింది. దీంతో ఈ అవకాశం కాజల్‌కు దక్కింది. అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుందని తెలిసినా అనుష్క ఇంకోసారి కూడా అవకాశం కోసం ఎదురు చూస్తోంది.