Thursday, December 30, 2010
పరమవీర చక్ర ఆడియో విడుదల
బాలకృష్ణ హీరోగా నటించిన 'పరమవీరచక్ర' ఆడియో విడుదల అభిమానుల కోలాహలంమధ్య శిల్పకళావేదికలో బుధవారం రాత్రి జరిగింది. తెలుగు, తమిళ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విధి నిర్వహణలో వికలాంగులైన మాజీ సైనికులకు బాలకృష్ణ చేతులమీదుగా ఆర్థిక సాయం జరిగింది. మరోవైపు దాసరి 150 సినిమాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కె. బాలచందర్ దాసరిని సత్కరించారు.
యాభైరోజులు పూర్తయిన 'ఏమైంది ఈవేళ'
వరుణ్‌సందేశ్, నిషా అగర్వాల్ హీరోహీరోయిన్లుగా సంపత్‌నంది దర్శకత్వంలో రూపొందిన 'ఏమైంది ఈ వేళ' చిత్రం 32 కేంద్రాల్లో 50రోజులు పూర్తిచేసుకుందని చిత్ర నిర్మాత రాధామోహన్ తెలియజేశారు. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు. క్లాస్, మాస్, యూత్, ఫ్యామిలీ అన్న తేడా లేకుండా అందర్నీ మా చిత్రం ఆకట్టుకుంటున్నందుకు ఆనందంగా ఉందని చిత్ర సమర్పకులు అరిమిల్లి రామకృష్ణ చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ... నేను చేసిన తొలి సినిమానే సక్సెస్‌కావడం ఆనందంగా ఉందంటూ.. ప్రేక్షకులకు నూతన సంవత్సరశుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: బుజ్జి.
Subscribe to:
Posts (Atom)