Sunday, November 21, 2010

రెండో రోజు భారత్‌ స్కోర్‌ 292/2




 న్యూజిలండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట మూగిసే సమయానికి భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసింది. సచిన్‌ 57, ద్రావిడ్‌ 69 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. అంతక ముందు న్యూజిలాండ్‌ 148 పరుగులతో ఆట ప్రారంభించి మరో 45 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ 292/2 పరుగులు చేసింది. సెహ్వాగ్‌, గంభీర్‌ ఇద్దరు ఆట ప్రారంభించి మొదటి వికెటు 113 పరుగుల వద్ద సెహ్వాగ్‌ వెట్లోరి బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. ( 72 బంతులలో 12 ఫోర్లు, 1 సిక్స్‌లతో ) 74 పరుగులు చేశాడు. గంభీర్‌ ( 127 బంతులలో 12 ఫోర్లు ) 78 పరుగులు చేశాడు. సచిన్‌ 57, ద్రావిడ్‌ 69 పరుగులతో క్రీజులో ఉన్నారు. కివీస్‌ బౌలింగ్‌లో వెట్లోరి, సౌతీ చెరో వికెటు లభించింది. భారత్‌ 99 పరుగుల అధిక్యతం ఉంది.