‘దేవుడా.. శ్రుతీహాసన్‌కి పెళ్లయ్యిందా? ఏం పాపం చేశామని ఇప్పుడే పెళ్లి
చేసేసుకుంది. ఇంకొన్నాళ్ల పాటు సినిమాలు చేస్తుందా? లేదా.. కొంపతీసి
సినిమాలు మానేసే ఉద్దేశం ఏమీ లేదు కదా’ అని శ్రుతీహాసన్ అభిమానులు తెగ
ఫీలైపోయారు. వీళ్లు ఇంతగా బాధపడిపోవడానికి కారణం, సరదాగా శ్రుతీహాసన్ తన
ట్విట్టర్‌లో చేసిన ఓ ట్వీట్. ‘లంచ్ విత్ మై డియరెస్ట్ హజ్బెండ్’ అంటూ
శ్రుతి ఓ ఫొటోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో దుమారమే
చెలరేగింది.
అది చూసి, ఆమె అభిమానులందరూ చెలరేగిపోయారు. ‘మీకు పెళ్లయిందా...? అతను మీ భర్తా... ఇంతకన్నా హ్యాండ్‌సమ్ పర్సన్ మీకు భర్తగా వస్తాడు కదా... ఇంత తొందరపడ్డారేంటి?’ అని కామెంట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో శ్రుతీహాసన్ ‘‘నాకస్సలు పెళ్లి కాలేదు.. నిజం చెబుతున్నా... నన్ను నమ్మండి. సరదాగా చేసిన ట్వీట్ అది’’ అని పోస్ట్ పెట్టడంతో అభిమానులు శాంతించారు.